REVANTH: మోదీ కులంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

REVANTH: మోదీ కులంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X
అసలు మోదీ పుట్టుకతో బీసీ కాదన్న రేవంత్... ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని స్పష్టీకరణ

పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని... ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ బీసీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సభలో సీఎం రేవంత్‌.. ప్రధాని మోదీ, కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ అని.... కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి అని రేవంత్ విమర్శించారు. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని గుర్తు చేశారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా అని రేవంత్ అన్నారు. 2002 వరకు మోదీ ఉన్నత వర్గాల్లో ఉండేవారని అన్నారు. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని పేర్కొన్నారు. తాను మోదీ కులం గురించి ఆషామాషీగా మాట్లాడడం లేదని, అన్నీ తెలుసుకునే చెబుతున్నాని వెల్లడించారు. కేంద్రానికి సవాల్ చేస్తున్నా.. జనగణనతో పాటు కులగణన చెయ్యాలన్నారు. కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్,కేటీఆర్,హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి.

కొడితే కేటీఆర్‌, కవితను కొట్టాలి: రేవంత్

మాజీ సీఎం KCRపై CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొడితే గట్టిగా కొడతామని కేసీఆర్ అంటున్నారు. ఆయన కొట్టాలంటే కేటీఆర్, కవిత, హరీష్‌రావునే కొట్టాలి. కేటీఆర్ నిన్ను ఓడిస్తే, కవిత కేజ్రీవాల్‌ను ఓడించారు. మీ కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలను చూసే ప్రజలు బండకేసి కొట్టారు. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తానంటున్నారు. ఆయన ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడే యూత్ కాంగ్రెస్ నేతలు కొట్లాడారు’. అని అన్నారు.

అదే నిజమైతే కేసీఆర్ గెలిచే వాడు: రేవంత్ రెడ్డి

‘ఫ్లెక్సీలు కట్టి దండాలు పెడితేనో, లేక డిల్లీ నుంచి గల్లీకి వస్తేనో పదవులు రావు. డబ్బులు ఉన్నంత మాత్రాన గెలుపు రాదు. అదే నిజమైతే కేసీఆర్ గెలిచేవాడు. కేసీఆర్ దగ్గర రూ. వెయ్యి కోట్లు ఉన్నాయి. డబ్బులు పంచితే గెలిచే అవకాశం ఉంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చేవి. ’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో కేసీఆర్ ప్రజలను ఊరించి మోసం చేశారు. కేసీఆర్ మోసం చేశారు కాబట్టే.. మాకు అధికారం ఇచ్చారు. అందుకే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Tags

Next Story