REVANTH: పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ

REVANTH: పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ
ప్రపంచం తలకిందులైనా ఆపబోను... రేవంత్‌రెడ్డి హామీ

ప్రపంచం తలకిందులైనా రుణమాఫీని ఆపబోనని............ ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. రుణమాఫీ పూర్తి చేసి ప్రజల రుణం...... తీర్చుకుంటామన్నారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో కోమటిరెడ్డి సోదరులతో కలిసి పాల్గొన్న రేవంత్ రెడ్డి......... తర్వాత జరిగిన బహిరంగ సభలో భారాసా-భాజపాలపై విమర్శలు... గుప్పించారు. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయన్న సీఎం...... దానికి భారాస మద్దతు పలుకుతోందని............. మండిపడ్డారు. మోదీ వ్యవస్థలను చెరబట్టి విపక్షాలను బెదిరించేందుకు వాడుకుంటున్నారని... రేవంత్ విమర్శించారు. నెల రోజులకే కాంగ్రెస్ ను గద్దె దించాలని కేసీఆర్ అంటున్నారని........ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోదీని గద్దె దించాలని ఎందుకు అనటం లేదని......... ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. దే సభలో తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


రోడ్ షోలో బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల పేరుతో కేసీఆర్ ఎలక్షన్.. సెలక్షన్, కలెక్షన్ చేశారని మండిపడ్డారు. భూమికి మూడు అడుగులున్న సీసాల సోడా పోసే ఒకరు(మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డిని) ఉద్దేశించి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యంగంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తనతో పాటు ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికేనని అన్నారు. వేల అబద్ధాలు చెప్పి రూ. 7లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ 100 రోజులకే కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని అనడం ధర్మమా అని ప్రశ్నించారు. భువనగిరిలో 3లక్షల మెజార్టీతో కిరణ్‌ను గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్‌గా మారి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చామల కిరణ్‌ను గెలిపిస్తే 50వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని మాటిచ్చారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా మారుస్తామని.. మళ్లీ వచ్చి యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తానని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి సాక్షిగా పంద్రాగస్టు లోపుల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.


ఎన్నో రైతు ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులను కేసీఆర్‌ ఏనాడూ గౌరవించలేదు. మోదీ ప్రభుత్వాన్ని దించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి వచ్చారు. పదేళ్లపాటు భారాస ప్రభుత్వం మోదీకి మద్దతిచ్చింది. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు భారాస ఎంపీలు మద్దతిచ్చారు. పదేళ్ల భారాస పాలనలో పేద బిడ్డలెవరికీ ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ, 30లక్షల మంది యువతను పట్టించుకోలేదు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ సెంటర్లలో అమ్మి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన మోదీకి.. ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా? ఆంధ్రాలో కాంగ్రెస్‌కు నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేసింది. వచ్చే పంటలో వడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తాం’’ అని సీఎం హామీ ఇచ్చారు. ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story