RIYAZ: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం

నిజామాబాద్లో రౌడీషీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందిస్తామని తెలంగాణ డీజీపీ ప్రకటించారు. అంతే కాకుండా కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 300 గజాల ఇంటిస్థలం మంజూరు చేయిస్తామని, అతడి ఉద్యోగ విరమణ వరకు వచ్చే జీతాన్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రత నిధి నుండి రూ.16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుండి మరో రూ.9 లక్షలు ఇస్తామని చెప్పారు. రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. గది బయట కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడని డీజీపీ తెలిపారు. అందుకే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్ను నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. గది బయట కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడని డీజీపీ తెలిపారు. అనంతరం పోలీసులపై కాల్పులు జరిపేందుకు రియాజ్ ప్రయత్నించగా.. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నిందితుడిపై కాల్పులు జరిపారని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com