ACCIDENT: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిహోరా ప్రాంతంలో మినీ బస్, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్‌లోని జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో సిమెంట్ లోడ్‌తో ఓ లారీ రాంగ్ రూట్ లో హైవేపైకి వచ్చింది. దీంతో వేగంగా వస్తున్న యాత్రికుల మినీ బస్సు సిమెంట్ లారీని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద స్థలికి చేరుకున్న జబల్ పూర్ పోలీసులు.. క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన మినీ బస్సుఏపీలో రిజిస్ట్రేషన్ కావడంతో ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ వాసులని తొలుత భావించారు. అయితే, ప్రమాద స్థలంలో దొరికిన ఆధారాలను పరిశీలించగా.. చనిపోయిన వారంతా హైదరాబాద్ లోని నాచారం వాసులని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. యాత్రికుల మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com