హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ నగర శివారులోని మైలార్ దేవ్‌పల్లిలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు యాసిన్ ఖాన్ సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు శంషాబాద్ DCP ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిందితులంతా హైదరాబాద్ పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
2018లో నిందితుడి తండ్రి అంజద్ ఖాన్‌ను.. అసద్ ఖాన్ అంతమెందించాడు. దానికి ప్రతీకారంగా యాసిన్ ఖాన్.. రౌడీ షీటర్ అసద్ ఖాన్‌ను హత్య చేసినట్లు DCP ప్రకాష్ రెడ్డి తెలిపారు. రెండ్రోజుల క్రితం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హతుడు అసద్ ఖాన్.. తన స్నేహితుడితో కలిసి బుల్లెట్ బైక్ పై మైలార్ దేవ్‌పల్లి వైపు బయల్దేరాడు. ఇదే అదునుగా నిందితుడు యాసిన్ ఖాన్.. మరో ఆరుగురి సహాయంతో ఆటోలో వచ్చి అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయారని DCP తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com