ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి కరోనా.. !

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి కరోనా.. !
X
మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "గత రెండురోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్టు చేయించుకుని, పాజిటివ్ గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఆదివారం నల్లగొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే..!


Tags

Next Story