CM Revanth Reddy : ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు

CM Revanth Reddy : ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు
X
ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్‌

షాద్‌నగర్‌‌‌, కొందుర్గులో సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మారిపోయాడా? అని అన్నారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వాలనే సోయి లేని కేసీఆర్‌ వెంట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా నడుస్తున్నాడని సీరియస్ అయ్యారు. పేద, బలహీనవర్గాల విద్యార్థులను గొప్ప నాయకులు, వైద్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఇందులో భాగంగానే యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నాం.

ప్రతి పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించనున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో శుక్రవారం సమీకృత గురుకుల పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేసి.. అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు. ‘గత ప్రభుత్వం విద్యార్థులకు చదువును దూరం చేసేలా ఐదువేల పాఠశాలలను మూసేసింది. మేం అధికారంలోకి రాగానే.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, తండాలు, పల్లెలు, పట్ణణాలు, బస్తీల్లో విద్యకు దూరమవుతున్న పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న అంశాలపై మేధావులతో చర్చించాం. యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలందరినీ ఒకేచోట చేర్చి వారి మధ్య ఐకమత్యం పెరిగేలా కృషి చేస్తాం. గత ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకు దాన్ని నా దగ్గరే ఉంచుకున్నా. ఉపాధ్యాయుల కష్టాలు గుర్తించి 21 వేల మందికి పదోన్నతులిచ్చాం. బదిలీలు చేపట్టాం.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల విధి నిర్వహణకు అనువైన వాతావరణం కల్పిస్తున్నాం. బలహీనవర్గాలు, పేద విద్యార్థులు ఉచిత భోజన వసతితో చదువుకునేందుకు.. 1972లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహరావు గురుకుల పాఠశాలల విధానాన్ని ప్రవేశపెట్టారు. నల్గొండ జిల్లాలోని సర్వేల్‌ గ్రామంలోని గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి అక్కడ చదివినవారే. నాగార్జునసాగర్‌ గురుకుల పాఠశాల నుంచి ఎంతో మంది వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఐపీఎస్‌లు వచ్చారు. ఇలాంటి మేధోసంపత్తి కలిగిన వారిని ప్రస్తుత, భవిష్యత్తు కాలాల్లో తీర్చిదిద్దేందుకు యంగ్‌ ఇండియా సమీకృత పాఠశాలలకు రూపకల్పన చేశాం. ఒకేసారి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేయడంతో విద్యార్థుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నాం. వారిలో ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తున్నాం. అందుకే వేదికపై అధికారులు, ఎమ్మెల్యేలున్నా ఇద్దరు విద్యార్థులను మాట్లాడేందుకు పిలిచాం. వారిద్దరూ ఎంతోగొప్పగా మాట్లాడారు.

Tags

Next Story