SAJJANAR: పిచ్చి పలు రకాలు సజ్జనార్ ఆగ్రహం

SAJJANAR: పిచ్చి పలు రకాలు సజ్జనార్ ఆగ్రహం
X

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతకైనా తెగిస్తారా అంటూ టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మండిపడ్డారు. ఫస్ట్ టైమ్ గంజాయి తాగితే ఎలా ఉంటుందని యువకులు రీల్ వీడియో చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వీడియోను ఎక్స్‌‌లో షేర్ చేస్తూ 'పిచ్చి పలు రకాలు.. వెర్రి వెయ్యి రకాలు.. అంటే ఇదే. ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో కనీసం ఆలోచన ఉండక్కర్లేదా. ఎంతో మంది యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్న నిషేధిత డ్రగ్స్ పై వీడియోలు చేస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. రీల్స్ పిచ్చి పట్టిన ఇలాంటి మానసిక రోగులకు దూరంగా ఉండండి. వ్యూస్, లైక్స్, కామెంట్స్ మాత్రేమే వీళ్లకు కావాలి. రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు ఏమైనా చేస్తారు. సమాజం ఎటుపోయిన, ఎవరు ఏమైపోయిన వీళ్లకు సంబంధం లేదు' అంటూ మండిపడ్డారు.రీల్స్ పిచ్చి పట్టిన మానసిక రోగులకు దూరంగా ఉండండి. వ్యూస్, లైక్స్, కామెంట్స్ మాత్రేమే వీళ్లకు కావాలి. రాత్రే పాపులర్ అయ్యేందుకు ఏమైనా చేస్తారు. సమాజం ఎటుపోయిన, ఏమైపోయిన వీళ్లకు సంబంధం లేదు’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

Tags

Next Story