Sabitha Indra Reddy: 'ఇక పిల్లలకు సెలవులు లేవు.. రేపటి నుండి స్కూళ్లు పునఃప్రారంభం..'

X
By - Divya Reddy |12 Jun 2022 6:00 PM IST
Sabitha Indra Reddy: తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Sabitha Indra Reddy: తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవుల పొడిగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను రేపటి నుంచి పునఃప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని పాఠశాలల నిర్వాహకులను ఆదేశించామన్నారు. మనఊరు- మనబడిలో భాగంగా 9వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com