SAD: కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

SAD: కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
X
ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో 1952, సెప్టెంబర్ 14న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. నేడు మధ్యాహ్నం సూర్యాపేట రెడ్ హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. శుక్రవారం రోజున అంత్యక్రియలు నిర్వహిస్తారు.

రాంరెడ్డి దామోదర్ రెడ్డి మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఐటీ శాఖ మంత్రిగా దామోదర్ రెడ్డి సేవలందించారు.

Tags

Next Story