SAD: అంతులేని విషాదాన్ని మిగిల్చిన నాంపల్లి అగ్నిప్రమాదం

SAD: అంతులేని విషాదాన్ని మిగిల్చిన నాంపల్లి అగ్నిప్రమాదం
X
అగ్ని ప్రమాదంలో అయిదుగురు మృతి... 22 గంటలపాటు సాగిన రెస్య్కూ ఆపరేషన్... మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు

హై­ద­రా­బా­ద్ నగ­రం­లో­ని నాం­ప­ల్లి ప్రాం­తం­లో చో­టు­చే­సు­కు­న్న ఘోర అగ్ని­ప్ర­మా­దం నగ­రా­న్ని తీ­వ్ర వి­షా­దం­లో ముం­చిం­ది. నాం­ప­ల్లి స్టే­ష­న్‌ రో­డ్డు­లో ఉన్న ఓ ఫర్ని­చ­ర్‌ షా­పు­లో శని­వా­రం మధ్యా­హ్నం సం­భ­విం­చిన ఈ ప్ర­మా­దం­లో ఐదు­గు­రు ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. భవనం సె­ల్లా­ర్‌­లో చి­క్కు­కు­న్న­వా­రి­ని బయ­ట­కు తీ­సేం­దు­కు సు­మా­రు 22 గం­ట­ల­కు పైగా సహా­యక చర్య­లు కొ­న­సా­గ­గా, ఆది­వా­రం ఉదయం ఐదు­గు­రి మృ­త­దే­హా­ల­ను అధి­కా­రు­లు వె­లి­కి­తీ­శా­రు. ఈ ప్ర­మా­దం­లో చి­న్నా­రు­లు ప్ర­ణీ­త్, అఖి­ల్తో పాటు బీబీ, ఇం­తి­యా­జ్, హబీ­బ్ మృతి చెం­ది­న­ట్లు అధి­కా­రు­లు ధ్రు­వీ­క­రిం­చా­రు. మృ­త­దే­హా­ల­ను పో­స్టు­మా­ర్టం ని­మి­త్తం ఉస్మా­ని­యా ఆసు­ప­త్రి­కి తర­లిం­చా­రు. ఘటన సమ­యం­లో భవ­నం­లో మొ­త్తం ఆరు­గు­రు ఉన్న­ట్లు స్థా­ని­కు­లు చె­బు­తుం­డ­గా, మరో వ్య­క్తి ఆచూ­కీ కోసం గా­లిం­పు చర్య­లు ఇంకా కొ­న­సా­గు­తు­న్నా­యి. మృ­తు­లం­తా సె­ల్లా­ర్‌­లో­నే చి­క్కు­కు­పో­యి­న­ట్లు సమా­చా­రం. నాం­ప­ల్లి స్టే­ష­న్‌ రో­డ్డు­లో­ని హిం­దీ ప్ర­చా­ర్‌­సభ భవనం పక్క­నే ఉన్న సాయి వి­శ్వా­స్‌ ఛాం­బ­ర్స్‌ అనే ఐదం­త­స్తుల భవ­నం­లో ‘బచ్చా­స్‌ ఫర్ని­చ­ర్‌’ అనే షాపు ని­ర్వ­హి­స్తు­న్నా­రు. శు­క్ర­వా­రం రా­త్రి చైనా నుం­చి భా­రీ­గా ఫర్ని­చ­ర్‌ సరు­కు కం­టై­న­ర్‌­లో రాగా, దా­ని­ని భవ­నం­లో­ని రెం­డు సె­ల్లా­ర్ల­లో ని­ల్వ చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ దు­కా­ణం­లో సు­మా­రు 22 మంది ఉద్యో­గు­లు పని­చే­స్తు­న్నా­రు.

షా­పు­లో వా­చ్‌­మ­న్‌­గా పని­చే­స్తు­న్న యా­ద­య్య, లక్ష్మి దం­ప­తు­లు తమ ఇద్ద­రు పి­ల్ల­ల­తో కలి­సి సె­ల్లా­ర్‌­లో­నే ని­వా­సం ఉం­టు­న్నా­రు. శని­వా­రం పి­ల్ల­లు పా­ఠ­శా­ల­కు వె­ళ్ల­క­పో­వ­డం­తో సె­ల్లా­ర్‌­లో­నే ఉం­డి­పో­యా­రు. తల్లి­దం­డ్రు­లు పని­మీద బయ­ట­కు వె­ళ్ల­గా, మధ్యా­హ్నం ఒంటి గంట సమ­యం­లో ఒక్క­సా­రి­గా సె­ల్లా­ర్‌­లో మం­ట­లు చె­ల­రే­గా­యి. దట్ట­మైన పొ­గ­లు వ్యా­పిం­చ­డం­తో ఉద్యో­గు­లు ప్రా­ణ­భ­యం­తో బయ­ట­కు పరు­గు­లు తీ­శా­రు. ఈ ప్ర­మా­దం జరి­గిన సమ­యం­లో దు­కా­ణం­లో పని­చే­స్తు­న్న ఇం­తి­యా­జ్, హబీ­బ్ సె­ల్లా­ర్‌­లో చి­క్కు­కు­న్న పి­ల్ల­లు మరి­యు బీబీ అనే వృ­ద్ధు­రా­లి­ని బయ­ట­కు తీ­సేం­దు­కు లో­ప­లి­కి వె­ళ్లా­రు. అయి­తే, వారు తి­రి­గి బయ­ట­కు రా­లే­దు. దీం­తో పరి­స్థి­తి మరింత వి­ష­మం­గా మా­రిం­ది. సమా­చా­రం అం­దు­కు­న్న వెం­ట­నే ఫై­ర్‌, పో­లీ­సు, హై­డ్రా సహా మొ­త్తం తొ­మ్మి­ది వి­భా­గాల అధి­కా­రు­లు సం­ఘ­ట­నా స్థ­లా­ని­కి చే­రు­కు­ని సహా­యక చర్య­లు ప్రా­రం­భిం­చా­రు. పొగ, వేడి కా­ర­ణం­గా రె­స్క్యూ ఆప­రే­ష­న్‌­కు తీ­వ్ర ఆటం­కం ఏర్ప­డిం­ది. భవనం సె­ల్లా­ర్‌­కు జే­సీ­బీ సా­యం­తో రం­ధ్రం చేసి లో­ప­లి­కి చే­రు­కు­న్న అధి­కా­రు­లు మృ­త­దే­హా­ల­ను వె­లి­కి­తీ­శా­రు. ఈ ఘటన భవనం దృ­ఢ­త్వం­పై కూడా అను­మా­నా­ల­ను రే­కె­త్తిం­చిం­ది. ఇంకా భవనం లోపల వేడి, పొగ కొ­న­సా­గు­తుం­డ­టం­తో నా­లు­గు అం­త­స్తుల ఈ కట్ట­డం భద్ర­త­పై ప్ర­శ్న­లు తలె­త్తు­తు­న్నా­యి.

Tags

Next Story