SAD: పెళ్లి కావడం లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య నలిగిపోయిన ఓ యువతి తీవ్ర మనోవేదనకు లోనై ప్రాణాలు తీసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో విషాదాన్ని నింపింది. తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఒక వైపు, తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి మరోవైపు ఆమెను మానసికంగా కుంగదీసినట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి (26) కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆమె, అనారోగ్యం, వైకల్యంతో బాధపడుతున్న తల్లిని ఏళ్లుగా తానే చూసుకుంటూ వస్తోంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంటి సంరక్షణ మొత్తం ఆమె భుజాలపైనే ఉండటంతో, విజయలక్ష్మి పూర్తిగా కుటుంబానికే అంకితమై జీవనం సాగించినట్లు బంధువులు చెబుతున్నారు.
ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మికి వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ, తల్లిని విడిచి వెళ్లలేనన్న ఆందోళన ఆమెను తీవ్రంగా వెంటాడింది. పెళ్లి అయితే తల్లిని ఎవరు చూసుకుంటారన్న భయం, మరోవైపు వివాహం జరగకపోతే సమాజంలో ఎదురయ్యే ఒత్తిడి ఈ రెండింటి మధ్య ఆమె మానసికంగా తీవ్రంగా సతమతమైంది. వైకల్యంతో బాధపడుతున్న తల్లికి.. ఐటీ సంస్థలో పనిచేస్తూనే విజయలక్ష్మి.. అన్నీ తానై సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న లక్ష్మికి పలు వివాహ సంబంధాలు వచ్చాయి. కానీ.. తల్లి తనతోపాటే ఉంటుందని విజయలక్ష్మి వారికి చెబుతూ వస్తోంది.. దీంతో వారు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదని మనస్థాపానికి లోనైంది. గత నెల 31వ తేదీన రెండు రోజుల్లో తిరిగి వస్తానని.. కూకట్‌పల్లిలోని తల్లికి చెప్పి బయటకు వెళ్లిన విజయలక్ష్మి హుస్సేన్‌సాగర్ లో దూకి ప్రాణాలు తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
