SAD: అంత కష్టం ఏమొచ్చిందమ్మా...

SAD: అంత కష్టం ఏమొచ్చిందమ్మా...
X
ఇద్దరు పిల్లలను హత్య చేసి తల్లి ఆత్మహత్య

ఏ తల్లి అయి­నా కన్న­బి­డ్డ­ల­ను ప్రా­ణం కంటే ఎక్కు­వ­గా ప్రే­మి­స్తుం­ది. నవ­మా­సా­లు మోసి జన్మ­ని­చ్చిన బి­డ్డ­లే ఒక తల్లి­కి ప్రా­ణ­స­మా­నా­లు. వారి నవ్వే ఆమె ప్ర­పం­చం, వారి కన్నీ­ళ్లు ఆమె­కు గుం­డె­ల్లో మంట. అలాం­టి తల్లే క్ష­ణి­కా­వే­శం­లో తన సొంత పి­ల్ల­ల­కు మరణ శా­స­నం రా­స్తు­న్నా­రు. తె­లం­గా­ణ­లో­ని యా­దా­ద్రి భు­వ­న­గి­రి జి­ల్లా­లో చో­టు­చే­సు­కు­న్న ఈ హృదయ వి­దా­రక ఘటన తీ­వ్ర కల­క­లం రే­పిం­ది. జి­ల్లా­లో­ని బీ­బీ­న­గ­ర్ మం­డ­లం పరి­ధి­లో ఉన్న గొ­ల్ల­గూ­డెం గ్రా­మం­లో ఈ దా­రు­ణం వె­లు­గు చూ­సిం­ది. గ్రా­మా­ని­కి చెం­దిన మేకల మహే­శ్ యా­ద­వ్ రై­ల్వే శా­ఖ­లో ఉద్యో­గి­గా పని­చే­స్తు­న్నా­డు. కొ­న్నే­ళ్ల క్రి­తం ఆయ­న­కు ఐశ్వ­ర్య అనే యు­వ­తి­తో వి­వా­హం జరి­గిం­ది. ఈ దం­ప­తు­ల­కు రెం­డే­ళ్ల పాప, పది­నె­లల బాబు ఉన్నా­రు. అయి­తే కొం­త­కా­లం­గా భా­ర్యా­భ­ర్తల మధ్య వి­భే­దా­లు కొ­న­సా­గు­తు­న్న­ట్లు సమా­చా­రం. తరచూ గొ­డ­వ­లు జరు­గు­తు­న్నా­య­ని గ్రా­మ­స్తు­లు చె­బు­తు­న్నా­రు.

ఈ వి­వా­దాల నే­ప­థ్యం­లో ఐశ్వ­ర్య తన ఇద్ద­రు పి­ల్ల­ల­తో కలి­సి పు­ట్టిం­టి­కి వె­ళ్లిం­ది. కు­టుంబ సభ్యు­లు, పె­ద్ద­మ­ను­షు­లు జో­క్యం చే­సు­కు­ని సర్ది­చె­ప్పి మళ్లీ అత్తా­రిం­టి­కి పం­పిం­చా­రు. కానీ అదే రోజు రా­త్రి ఊహిం­చ­ని వి­షా­దం చో­టు­చే­సు­కుం­ది. అభం శుభం తె­లి­య­ని ఆ ఇద్ద­రు చి­న్నా­రు­ల­ను దిం­డు­తో ఊపి­రా­డ­కుం­డా చేసి ఐశ్వ­ర్య హత్య చే­సి­న­ట్లు పో­లీ­సు­లు ప్రా­థ­మి­కం­గా గు­ర్తిం­చా­రు. అనం­త­రం ఆమె ఇం­ట్లో ఫ్యా­న్‌­కు ఉరి­వే­సు­కు­ని ఆత్మ­హ­త్య చే­సు­కుం­ది. ఈ ఘటన గ్రా­మం­లో తీ­వ్ర వి­షా­దా­న్ని నిం­పిం­ది. చి­న్నా­రుల అమా­యక ము­ఖా­లు, వారి భవి­ష్య­త్తు ఒక్క క్ష­ణం­లో చీ­క­టి­లో కలి­సి­పో­వ­డం స్థా­ని­కు­ల­ను కల­చి­వే­సిం­ది. తల్లి­కి ఎలాం­టి మా­న­సిక ఒత్తి­డి, కష్టం ఎదు­రైం­దో తె­లి­య­దు కానీ పి­ల్ల­ల­ను హత­మా­ర్చ­డం అం­ద­రి­నీ షా­క్‌­కు గు­రి­చే­సిం­ది. సమా­చా­రం అం­దు­కు­న్న పో­లీ­సు­లు ఘట­నా­స్థ­లి­కి చే­రు­కు­ని మృ­త­దే­హా­ల­ను పరి­శీ­లిం­చా­రు. అనం­త­రం పో­స్ట్‌­మా­ర్టం ని­మి­త్తం సమీప ఆసు­ప­త్రి­కి తర­లిం­చా­రు. కేసు నమో­దు చేసి దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు. కు­టుంబ కల­హా­లే కా­ర­ణ­మా? లేక మరే­దై­నా కా­ర­ణ­మా? అన్న కో­ణం­లో పో­లీ­సు­లు వి­చా­రణ చే­ప­డు­తు­న్నా­రు. తల్లి చే­తు­ల్లో­నే ము­గి­సిన రెం­డు చి­న్నా­రుల ప్రా­ణా­లు సమా­జా­న్ని మరో­సా­రి ప్ర­శ్ని­స్తు­న్నా­యి.

Tags

Next Story