SADAR: యాదవుల సాంస్కృతిక ప్రతీక.. సందర్ ఉత్సవ్

అలనాటి సమాజంలో వారి వృత్తే వారికి గుర్తింపు, వారి జీవన విధానంలో భాగమైన పనులే వారి పండుగలు, అవే నేటికీ వారి సాంస్కృతిక ప్రతీకలు. అటువంటివే నేటి సదర్ ఉత్సవాలు. భిన్న సంస్కృతి,సంప్రదాయాలకు నిలయం హైదరాబాద్ నగరం. ఏటా సరిగ్గా దీపావళి సమయానికి జంటనగరాలు సదర్ ఉత్సవాలు జరుపుకోవడానికి ముస్తాబవుతాయి. దీన్నే వృషభోత్సవం అని కూడా అంటారు. సదర్ అనే ఉర్దూ పదానికి ఆత్మ విశ్వాసం, లీడర్ అనే అర్థాలు ఉన్నాయి. సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ప్రధానమైనది అని అర్థం. యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల నిర్వహణ వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ ఉత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతలో భాగంగా ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికి, తర్వాతి కాలంలో కనుమరుగై స్థానిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనాయి.
అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని సీఎం ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాజకీయ అవకాశాలు కల్పించిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో యాదవులది అత్యంత కీలకమైన పాత్ర అన్నారు. వారికి మరిన్ని అవకాశాల కోసం పార్టీ పెద్దల దృష్టికి తెస్తామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సదర్ ఉత్సవాలు మాత్రం 1946 నుంచి స్వర్గీయ చౌదరి మల్లయ్య యాదవ్, నారాయణ గూడ వైఎంసీలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాలక్రమేణా హైదరాబాద్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తున్నప్పటికీ, నారాయణగూడ వైఎంసీ సదర్ ఉత్సవం చరిత్ర, ప్రజాదరణ కారణంగా దీనిని పెద్ద సదర్ అంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com