Salam Sayeda Salva: ఆకాశమే నీ హద్దు...

Salam Sayeda Salva: ఆకాశమే నీ హద్దు...
X
హైదరాబాద్ కు చెందిన హిజాబ్ ధరించిన తొలి మహిళా పైలట్; ఆర్ధిక ఇబ్బందులకు ఎదురొడ్డి నింగిలో విహరించి....


ఓ దశాబ్దం క్రితం హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతూ, తండ్రి పనిచేస్తున్న బేకరి పరిసరాల్లో ఆడుకుంటోన్న హిజాబ్ ధరించిన ఓ చిన్నారి నేను పైలట్ అవుతానంటూ పాటలు పాడుకుంటూ ఎగిరి గంతులేస్తోంది. పదేళ్లు తిరిగేసరికి అదే చిన్నారి, అదే హిజాబ్ ను ధరించి ఆకాశ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఖండాంతరాలు దాటి పయనిస్తోంది. కమర్షియల్ పాసెంజర్ ఎయిర్ బస్ 320కి పైలట్ గా వ్యవహరించిన పిన్న వయస్కురాలైన మహిళగా గుర్తింపుపొందుతోంది సయేదా సాల్వా.


పదేళ్ల క్రితం చిన్నారి సయేదా పైలెట్ అవ్వాలన్న కోరిక నెరవేరడం వెనుక ఎన్ని కష్టాలు దాగున్నాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కలల మజిలీకి చేరుకునే ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. అమ్మాయిగా పురుషాధిక్య రంగంలో తన కలలను సాకారం చేసుకునేందుకు ముందు ఇంట్లో వాళ్లతోనే ఓ పెద్ద యుద్ధం జరగాలి, ఆర్ధికంగా వెనకబడిన కుటుంబంలో పుట్టింది కాబట్టి అడుగడుగునా డబ్బుల కోసం దిక్కులు చూాడలి, అన్నింటికీ మించినది భాషా సమస్య... ఇవన్నీ సయేదాకు అగ్ని పరీక్షలనే చెప్పాలి, కానీ ఇవన్నీ ఆమెను ఏనాడూ నిరుత్సాహ పరచలేదు సరికదా, ఆమెను మేలిమి ముత్యంలా మలచాయి.


చిన్ననాటి నుంచి ఆకాశంలోకి చూస్తూ దాన్ని తాకాలని పరితపించడం తనకు ఇంకా గుర్తు అంటారు ఫాతిమా. అప్పటి నుంచే వివిధ విమానాల బొమ్మలను కట్ చేసి పెట్టుకునే దాన్ని అంటూ గుర్తుచేసుకుంటారు. అయితే తన బంధువులు అందరూ తనని చూసి ఎగతాళి చేసేవారని, తల్లి దండ్రులు సైతం 12th పాస్ అయ్యాక ఇంజినీరింగ్ కాలేజీలో చేరమని ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే కోచింగ్ సమయంలో ఉర్దూ డైలీ ఛీఫ్ జాహిద్ ఖాన్ తనను ఏమి అవుతావని అడగ్గా, తాను వెంటనే పైలెట్ అని సమాధానమిచ్చానని చెప్పారు. అలా తన ఆత్మవిశ్వాసం నచ్చడంతో ఆయన చొరవతోనే 2007లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ ఎకాడమీలో చేరినట్లు తెలిపారు. అలా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫాతిమా తాను తొలిసారి ఫ్లైట్ ఎక్కిన అనుభూతి మధురజ్ఞాపకాల్లో నిలిచిపోయిందని వెల్లడించారు.


భారత్ లోనూ, విదేశాల్లోనూ ట్రైనింగ్ సమయంలో తాను హిజాబ్ వేసుకునే ఉన్నానని ఫాతిమా వెల్లడించారు. హిజాబ్ వల్ల తాను ఎప్పడూ ఇబ్బందులు ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా నైపుణ్యం, విద్యా విలువలు మాత్రమే ఉన్నత స్థానానికి చేరుకునేందుకు దోహదపడతాయని, దుస్తులు కాదని ఫాతిమా చెబుతున్నారు.


Tags

Next Story