Sammakka Sarakka : మేడారంలో సమ్మక్క సారక్క పూజారుల ధర్నా

మేడారం సమ్మక్క సారక్క పూజారులు రంగంపేటలో నూతనంగా నిర్మించిన ధార్మిక భవన్ ముందు ధర్నా చేపట్టారు. వారు ఈ భవనాన్ని "మేడారం ధార్మిక భవన్"గా నామకరణం చేసి పూర్తిగా తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
పూజారులు వేద పాఠశాల నిర్వహణను వెంటనే రద్దు చేయాలని, సమ్మక్క సారక్క జాతర కార్యనిర్వాహణ హోదాను అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుండి డిప్యూటీ కమిషనర్ స్థాయికి పెంచాలని కోరుతున్నారు.
అలాగే, మేడారం జాతర కార్యాలయ పరిధిలో శాశ్వత పోస్టులను మంజూరు చేయాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. జాతర సమయంలో ఆదివాసిలకే లిక్కర్, కొబ్బరికాయలు, బెల్లం షాపులు ఇవ్వడానికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.
ఈ పూజారుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని, వారి అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com