ఇసుక మాఫియా.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల వరకు వసూలు!

మహబూబాబాద్ జిల్లా నర్సింహలపల్లిలో ఇసుక ట్రాక్టర్ డీకొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఇసుక మాఫియా ఆగడాలు, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాతో రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కయ్యరని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నర్సింహులపేట తహసీల్దార్ పున్నం చందర్ ఇష్టారాజ్యంగా ఒకేసారి 300 మందికి ఇసుక కూపన్లు జారీ చేసినట్టు కలెక్టర్ గుర్తించారు. తహసీల్దార్ వున్నం చందర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐపై కలెక్టర్ బదిలీ వేటు వేశారు. ఇసుక కూపన్ల జారీలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క ట్రాక్టర్ వద్ద 3వేల నుంచి 5 వేల రూపాయల వరకు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com