నగరం నడిబొడ్డున బొమ్మకర్ర స్మగ్లర్లు..ఇందిరా పార్క్‌లో గంధం చెట్లు గయాబ్

ఎక్కడో శేషాచలం అడవుల్లో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున గంధపు చెక్కల స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. పుష్ప సినిమాలో చూపించినట్లు గంధపు చెక్కల స్మగ్లింగ్ రాష్ట్రం నడిబొడ్డున జరుగుతుంది. ఔను హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో రోజు రోజుకూ గంధం చెట్లు మాయం అయిపోతున్నాయి. గతంలో ఇందిరాపార్క్‌లో 10 గంధపు చెట్లను నరికి అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. మళ్లీ అదే బాటలో అపహరణ చేయడానికి, చెట్లుకు గాట్లు పెట్టి మరీ వెళ్లారు దుండగులు. ఇందిరాపార్క్‌లో దాదాపు 8గంధపు చెట్లకు గాట్లు పెట్టడంతో, పలు అనుమానాలకు తావిస్తుంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు నిఘా పెట్టారు. గంధపు చెట్ల అపహరణపై, గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇందిరాపార్క్ మేనేజర్ భాస్కర్. నింధితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పార్క్‌లో 8 గంధపు చెట్లకు గాట్లు పెట్లడంతో, అవి చనిపోకుండా ఉండేందుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందిరాపార్క్‌లో గంధపుచెట్ల మాయంపై సెక్యూరిటీ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఉందని ఆరోపిస్తున్నారు వాకర్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com