Sanga Reddy : బియ్యం లారీకి మంటలు

Sanga Reddy : బియ్యం లారీకి మంటలు
X
బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి

సంగారెడ్డి శివారులో అగ్నిప్రమాదం సంభవించింది. బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీలో అకాస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించారు. మిర్యాలగూడ నుండి నాందేడ్‌కు బియ్యం లోడ్‌తో వెళ్తుండగా .. లారీ టైర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటన గణేష్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకదళం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరీకీ ప్రాణనష్టం జరుగలేదని తెలుస్తోంది.

Tags

Next Story