Sanga Reddy: అనారోగ్య సమస్యలతో సర్పంచ్ ఆత్మహత్య

X
By - Prasanna |9 Feb 2023 4:50 PM IST
Sanga Reddy: అనారోగ్య సమస్యలతో సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
Telangana: అనారోగ్య సమస్యలతో సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది. తెలంగాణ సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్ద ముబరక్ పూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ దిగంబర్ (46) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో విధులు నిర్వర్తించలేకపోతున్నాను తనను సర్పంచ్ పదవి నుంచి రిలీవ్ చేయమంటూ కలెక్టర్ కు విన్నపం చేసుకున్నారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే దానిని ఇంకా ఆమోదించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఈలోపే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న అతడికి బతకాలన్న కోరిక నశించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com