SANKRANTHI: సంక్రాంతికి సిద్ధమవుతున్న ఆర్టీసీ

SANKRANTHI: సంక్రాంతికి సిద్ధమవుతున్న ఆర్టీసీ
X
ఏపీకి 5వేల ప్రత్యేక బస్సులు... నగర శివార్ల నుంచే బస్సుల ఏర్పాటు... ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు

సం­క్రాం­తి నే­ప­థ్యం­లో సొం­తూ­ళ్ల­కు వె­ల్లే వా­రి­ని క్షే­మం­గా గ‌­మ్య­స్థా­నా­ల­కు చే­ర్చేం­దు­కు రద్దీ­కి అను­గు­ణం­గా అన్ని ఏర్పా­ట్లు చే­సి­న­ట్టు, టీ­జీ­ఎ­స్ ఆర్టీ­సీ అధి­కా­రు­లు­తె­లి­పా­రు. ఈ పం­డు­గ­కు 5వే­ల­కు­పై­గా­ప్ర­త్యేక బస్సు­ల­ను నడ­పా­ల­ని యా­జ­‌­మా­న్యం ఇప్ప­టి­కే ని­ర్ణ­యిం­చిం­ద­న్నా­రు. ప్ర­ధా­నం­గా ఈ నెల 10, 11, 12 తే­ది­ల్లో ప్ర­యా­ణి­కుల ర‌­ద్దీ ఎక్కు­వ­‌­గా ఉండే అవ­‌­కా­శా­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని దా­ని­కి అను­గు­ణం­గా ఏర్పా­ట్ల­ను పూ­ర్తి స్తా­యి­లో చే­సి­న­ట్టు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­లో రద్దీ ప్రాం­తా­లైన ఎం­జీ­బీ­ఎ­స్, జే­బీ­ఎ­స్‌, ఉప్ప­ల్‌ క్రా­స్‌ రో­డ్స్‌, ఆరాం­ఘ­ర్‌, ఎల్బీ­న­గ­ర్‌ క్రా­స్‌ రో­డ్స్‌, కే­పీ­హె­చ్‌­బీ, బో­యి­న్‌­ప­ల్లి, గచ్చి­బౌ­లి, తది­తర ప్రాం­తాల నుం­చి ప్ర­త్యేక బస్సు­ల­ను సం­స్థ నడు­పు­తుం­ద­న్నా­రు. ఇప్ప­టి­కే రద్దీ ఎక్కువ ఉన్న ప్రాం­తా­ల్లో ప్ర­యా­ణి­కుల సౌ­క­ర్యా­ర్థం పం­డ­ల్స్, షా­మి­యా­నా­లు, కు­ర్చీ­లు, పబ్లి­క్ అడ్ర­స్ సి­స్టం, తా­గు­నీ­టి సదు­పా­యా­లు, మొ­బై­ల్ టా­యి­లె­ట్ల­ను ఏర్పా­టు చే­శా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. సం­క్రాం­తి పం­డుగ కోసం నడి­పే ప్ర­త్యేక బస్సుల కోసం రూ.1.50 వరకు టి­క్కె­ట్ ధర­ల­ను పెం­చు­కు­నే అవ­కా­శా­న్ని ఇచ్చి­న­ట్టు ఆర్టీ­సీ సం­స్థ ప్ర­తి­ని­ధు­లు తె­లి­పా­రు. సం­క్రాం­తి పం­డు­గ­కు సొం­తూ­ళ్ల­కు వె­ళ్లే ప్ర­యా­ణి­కుల రద్దీ­కి అను­గు­ణం­గా ఏపీ, తె­లం­గాణ జి­ల్లా­ల­కు ఆర్టీ­సీ బస్సు­లు నడు­పు­తుం­ద­ని రం­గా­రె­డ్డి రీ­జి­య­న్‌ మే­నే­జ­ర్‌ శ్రీ­లత తె­లి­పా­రు.

ఉత్తర తె­లం­గా­ణ­కు జే­బీ­ఎ­స్‌.. వి­జ­య­వాడ, నల్ల­గొండ, ఖమ్మం ప్రాం­తా­ల­కు ఎల్‌­బీ­న­గ­ర్‌ నగ­ర్‌ నుం­చి ప్ర­త్యేక బస్సు­లు నడు­ప­ను­న్న­ట్లు చె­ప్పా­రు. సౌ­త్‌­జో­న్‌, సు­ల్తా­న్‌ బజా­ర్‌ రా­జేం­ద్ర­న­గ­ర్‌ ఏసీ­పీ­లు కె.లక్ష్మ­ణ్‌, కె.శ్రీ­ని­వా­స్‌, డి.సు­ధీ­ర్‌­రె­డ్డి, ఆర్టీ­సీ అధి­కా­రు­లు మహాం­కా­ళి, ఎన్‌.జా­న­కి­రాం, ట్రా­ఫి­క్‌ సీ­ఐ­లు వి.మద­న్‌­లా­ల్‌, జి.బా­ల­కృ­ష్ణ పలు­వు­రు అధి­కా­రు­లు పా­ల్గొ­న్నా­రు.

సం­క్రాం­తి పం­డుగ వేళ వి­జ­య­వాడ వె­స్ట్‌ బై­పా­స్‌­లో కాజ నుం­చి గొ­ల్ల­పూ­డి వరకు ఒక­వై­పు వా­హ­నా­లు పరు­గు­లు పె­ట్ట­ను­న్నా­యి. మొదట కా­ర్లు, ద్వి­చ­క్ర వా­హ­నా­ల­ను ఈ మా­ర్గం­లో వె­ళ్లేం­దు­కు అవ­కా­శం కల్పి­స్తా­రు. దీం­తో గుం­టూ­రు వైపు నుం­చి వచ్చే వా­హ­నా­లు ఈ బై­పా­స్‌ మీ­దు­గా నే­రు­గా గొ­ల్ల­పూ­డి, అక్క­డి నుం­చి చి­న్నఅ­వు­ట­ప­ల్లి మీ­దు­గా ఏలూ­రు వైపు వె­ళ్ల­వ­చ్చు. ఈ మే­ర­కు ఎన్‌­హె­చ్‌­ఏఐ అధి­కా­రు­లు ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. పా­క్షి­కం­గా ఒక వైపు వా­హ­నా­లు వె­ళ్లే­లా చూ­డ­ను­న్నా­రు. వై­స్ట్‌ బై­పా­స్‌­లో భా­గం­గా కాజ-గొ­ల్ల­పూ­డి మధ్య 17.88 కి.మీ, గొ­ల్ల­పూ­డి-చి­న్నఅ­వు­ట­ప­ల్లి మధ్య 30 కి.మీ. ఆరు వరు­సల హైవే ని­ర్మా­ణం చే­ప­ట్టా­రు. ఇం­దు­లో గొ­ల్ల­పూ­డి- చి­న్నఅ­వు­ట­ప­ల్లి మధ్య ని­ర్మా­ణం పూ­ర్తి­కా­గా నవం­బ­రు నుం­చి వా­హ­నాల రా­క­పో­క­ల­కు అను­మ­తి­స్తు­న్నా­రు.

Tags

Next Story