KAVITHA: కేసీఆర్ దగ్గరున్న దెయ్యం సంతోష్‌రావు

KAVITHA: కేసీఆర్ దగ్గరున్న దెయ్యం సంతోష్‌రావు
X
సంతోష్‌రావు దుర్మార్గుడు, దెయ్యం..కార్యకర్తలు దూరం కావడానికి ఆయనే కారణం... నేతలు వీడడానికి సంతోష్‌రావే కారణం... సంతోష్.. రేవంత్ రెడ్డి గూఢచారన్న కవిత

మాజీ రా­జ్య­సభ సభ్యు­డు, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ సీ­ని­య­ర్ నేత జో­గి­ని­ప­ల్లి సం­తో­ష్‌­రా­వు­పై తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు, మాజీ ఎమ్మె­ల్సీ కల్వ­కుం­ట్ల కవిత సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. పా­ర్టీ­కి కా­ర్య­క­ర్త­లు, ఉద్య­మ­కా­రు­లు, సీ­ని­య­ర్ నే­త­లు దూ­ర­మ­వ­డా­ని­కి ప్ర­ధాన కా­ర­ణం సం­తో­ష్‌­రా­వే­న­ని ఆమె తీ­వ్ర ఆరో­ప­ణ­లు గు­ప్పిం­చా­రు. బీ­ఆ­ర్‌­ఎ­స్‌­లో నా­య­కు­లు, కా­ర్య­క­ర్త­ల­కు తీ­వ్ర మనో­వే­దన కలి­గిం­చిన తొలి వ్య­క్తి సం­తో­ష్‌­రా­వే­న­ని కవిత వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఉద్యమ కాలం నుం­చి పా­ర్టీ ని­ర్మా­ణం వరకు కీలక పా­త్ర పో­షిం­చిన నే­త­లు ఒక్కొ­క్క­రి­గా దూ­ర­మ­య్యేం­దు­కు ఆయన వ్య­వ­హా­ర­శై­లే కా­ర­ణ­మ­ని ఆరో­పిం­చా­రు. బీ­ఆ­ర్‌­ఎ­స్ పా­ర్టీ­కి, పా­ర్టీ అధి­నేత కే­సీ­ఆ­ర్కు ఉద్య­మ­కా­రు­ల­ను దూరం చే­సిన మొ­ద­టి వ్య­క్తి సం­తో­ష్‌­రా­వే­న­ని ఆమె పే­ర్కొ­న్నా­రు.

గద్దర్‌ను నిలబెట్టింది కూడా ఆయనే

ఉద్యమ నా­య­కు­లు, సాం­స్కృ­తిక వ్య­క్తు­లు పా­ర్టీ­కి దగ్గర కా­కుం­డా అడ్డు­కు­న్నా­ర­ని కవిత వి­మ­ర్శిం­చా­రు. ప్ర­జా ఉద్య­మా­ల­కు ప్ర­తీ­క­గా ని­లి­చిన గద్ద­ర్ వంటి నే­త­లు కూడా గౌ­ర­వం పొం­ద­ని పరి­స్థి­తి ఏర్ప­డిం­దం­టే, దా­ని­కి కా­ర­ణం సం­తో­ష్‌­రా­వు వ్య­వ­హా­ర­మే­న­ని ఆరో­పిం­చా­రు. అలా­గే ఈటెల రా­జేం­ద­ర్ లాం­టి ఉద్యమ నే­ప­థ్యం ఉన్న నా­య­కు­లు పా­ర్టీ వీ­డ­టా­ని­కి కూడా ఆయన వ్య­వ­హా­ర­మే కా­ర­ణ­మ­ని అన్నా­రు. సం­తో­ష్‌­రా­వు ప్ర­స్తు­తం ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­తో అం­ట­కా­గు­తు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు. కే­సీ­ఆ­ర్ వ్య­క్తి­గత వి­ష­యాల నుం­చి ఫా­మ్‌­హౌ­స్‌­లో జరి­గే చి­న్న వి­ష­యాల వరకూ సమా­చా­రా­న్ని ప్ర­భు­త్వ పె­ద్ద­ల­కు చే­ర­వే­స్తు­న్నా­ర­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. పా­ర్టీ అం­త­ర్గత సమా­చా­రం లీక్ కా­వ­డం వె­నుక కూడా ఆయనే ఉన్నా­ర­న్న ఆరో­ప­ణ­లు చే­శా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ వ్య­వ­హా­రం­లో సం­తో­ష్‌­రా­వు­పై సిట్ వి­చా­రణ జరు­గు­తుం­ద­న్న ప్ర­భు­త్వ ప్ర­క­ట­న­పై కూడా కవిత అను­మా­నం వ్య­క్తం చే­శా­రు. సిట్ ఏర్పా­టు చే­య­డ­మే కా­కుం­డా ని­జం­గా చట్ట­ప­ర­మైన చర్య­లు తీ­సు­కుం­టా­రా అనే సం­దే­హం ఉం­ద­న్నా­రు. చట్టం సక్ర­మం­గా పని­చే­స్తే సం­తో­ష్‌­రా­వు­కు తప్ప­కుం­డా శి­క్ష పడు­తుం­ద­ని ఆమె అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఇలాం­టి ఆరో­ప­ణల మధ్య, సం­తో­ష్‌­రా­వు­కు బీ­ఆ­ర్‌­ఎ­స్‌­లో­ని కొం­ద­రు కీలక నే­త­లు మద్ద­తు ఇస్తు­న్నా­ర­ని కవిత వి­మ­ర్శిం­చా­రు. ము­ఖ్యం­గా కే­టీ­ఆ­ర్, హరీ­ష్‌­రా­వు లాం­టి నే­త­లు ఆయ­న­కు ఎం­దు­కు అం­డ­గా ని­లు­స్తు­న్నా­రో అర్థం కా­వ­డం లే­ద­న్నా­రు. పా­ర్టీ­కి నష్టం కలి­గిం­చిన వ్య­క్తి­ని సమ­ర్థిం­చ­డం వల్ల భవి­ష్య­త్తు­లో మరింత నష్టం జరు­గు­తుం­ద­ని హె­చ్చ­రిం­చా­రు.

తెలంగాణ ప్రభుత్వంపైనా...

ఇక మరో­వై­పు రా­ష్ట్రం­లో శాం­తి­భ­ద్ర­తల పరి­స్థి­తు­ల­పై కూడా కవిత తీ­వ్ర వి­మ­ర్శ­లు చే­శా­రు. గం­జా­యి ముఠా దా­డి­లో తీ­వ్రం­గా గా­య­ప­డి ఆస్ప­త్రి­లో చి­కి­త్స పొం­దు­తు­న్న ఎక్సై­జ్ కా­ని­స్టే­బు­ల్ కు­టుం­బా­న్ని ఆమె పరా­మ­ర్శిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డు­తూ, తె­లం­గా­ణ­లో నే­రా­లు పె­రి­గి­పో­యా­య­ని, ము­ఖ్యం­గా మహి­ళా అధి­కా­రు­ల­కే రక్షణ లేని పరి­స్థి­తి నె­ల­కొం­ద­ని ఆరో­పిం­చా­రు. నే­ర­స్థు­ల­కు పో­లీ­సు­లం­టే గానీ, చట్టా­లం­టే గానీ భయం లే­కుం­డా పో­యిం­ద­ని కవిత మం­డి­ప­డ్డా­రు. ఎక్సై­జ్, ఫా­రె­స్ట్ అధి­కా­రు­ల­పై దా­డు­లు పె­రు­గు­తు­న్నా ప్ర­భు­త్వం తగిన చర్య­లు తీ­సు­కో­వ­డం లే­ద­న్నా­రు. గతం­లో ఈ శాఖల అధి­కా­రు­ల­కు ఉన్న ఆయు­ధా­ల­ను తి­రి­గి ఇవ్వా­ల­ని ఆమె డి­మాం­డ్ చే­శా­రు. అధి­కా­రుల వద్ద వె­ప­న్స్ ఉం­టే­నే స్మ­గ్ల­ర్లు, అసాం­ఘిక శక్తు­లు వె­న­క­డు­గు వే­స్తా­ర­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు.

Tags

Next Story