Saroor Nagar Murder: సరూర్‌నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..

Saroor Nagar Murder: సరూర్‌నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటికొచ్చాయి. నాగరాజు మైబైల్‌లో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసిన నిందితులు.. ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. ఇక రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్యను వాయిదా వేసుకుని.. దీక్ష ముగియగానే స్కెచ్ వేసి నాగరాజును హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇక నిందితులు సయ్యద్ మోబిన్, మసూద్ అహ్మద్ రిమాండ్‌లో ఉన్నారు.
వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లికిచెందిన నాగరాజు సరూర్ నగర్‌లోని ఓ కార్లషోరూమ్‌లో సేల్స్ మేన్‌గా పనిచేస్తుండేవాడు. అతను సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అనే యువతిని ప్రేమించి జనవరిలో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమపెళ్లి ఇష్టంలేని యువతి కుటుంబసభ్యులు నాగరాజు హత్యకు ప్లాన్ వేశారు.
ఈ నేపథ్యంలోనే 4వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా బైక్ వెళ్తుండగా.. సరూర్‌నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర్లో వీరిని అడ్డగించి నాగరాజు పై ఇనుపరాడ్‌తో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజు స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే అతిదారుణంగా ఈ దాడి జరిగింది. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com