Nalgonda : గ్రామాభివృద్ధి కోసం చేసిన రుణాలకు వడ్డీ కట్టలేక పుస్తెలతాడు అమ్ముకున్న సర్పంచ్‌

Nalgonda :  గ్రామాభివృద్ధి  కోసం చేసిన రుణాలకు వడ్డీ కట్టలేక పుస్తెలతాడు అమ్ముకున్న సర్పంచ్‌
Nalgonda : గ్రామాభివృద్ధి కోసం రుణాలకు వడ్డీ కట్టలేక పుస్తెలతాడును సైతం అమ్ముకుందో సర్పంచ్‌.

Nalgonda : గ్రామాభివృద్ధి కోసం రుణాలకు వడ్డీ కట్టలేక పుస్తెలతాడును సైతం అమ్ముకుందో సర్పంచ్‌. పల్లెప్రగతిలో భాగంగా గ్రామ అభివృద్ధి పనులు చేసి రెండేళ్లు కావస్తున్నా బిల్లులు రాకపోవడంతో అధికారులను నిలదీసింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం యరుగండ్లపల్లి సర్పంచ్‌ మాడెం శాంతమ్మ.. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పల్లె ప్రగతి సమీక్ష కార్యక్రమంలో పాల్గొంది. బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారంటూ అధికారులను ప్రశ్నించింది. 25 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేయించానని.. రెండేళ్లు దాటినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. దీంతో రుణాల కోసం తన పుస్తెలతాడు అమ్మి వడ్డీ కట్టాల్సి వచ్చిందని వాపోయింది.

Tags

Read MoreRead Less
Next Story