Satvik Sucide: కంటతడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్...

శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్యకు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ బయటపడటంతో అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితులపై పోలీసులు ఓ అంచనాకు వస్తున్నారు. అమ్మా నాన్నా నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సాత్విక్, ఎవరినీ బాధపట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ప్రిన్సిపాల్, కాలేజీ ఇన్ఛార్జ్, లెక్చరర్స్ టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. కాలేజీ సిబ్బంది కృష్ణా రెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ తనను వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించాడు. వీరందరూ ఏకమైన హాస్టల్ విద్యార్ధులను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఈ వేధింపులకు తాళలేక తాను ఇంత విపరీత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తనని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. స్నేహితులకు తాను వెళ్లిపోతున్నందుకు సారీ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com