SAUDI: 45 మంది హైదరాబాదీల సజీవ దహనం

SAUDI: 45 మంది హైదరాబాదీల సజీవ దహనం
X
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..45 మంది మృతి.. ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబాలు.. డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు

సౌ­దీ­లో­ని పవి­త్ర మక్కా నుం­చి మదీ­నా­కు వె­ళ్తు­న్న ఉమ్రా యా­త్రి­కుల బస్సు­ను డీ­జి­ల్ ట్యాం­క­ర్ ఢీ­కొ­న్న ఘట­న­లో ఘోర వి­షా­దం చో­టు­చే­సు­కుం­ది. సో­మ­వా­రం తె­ల్ల­వా­రు­జా­మున ము­ఫ్రి­హ­త్ వద్ద జరి­గిన ఈ భయా­నక అగ్ని­ప్ర­మా­దం­లో 45 మంది హై­ద­రా­బా­దీ­లు సజీవ దహ­నమయ్యారు. ఈ దా­రుణ ఘట­న­లో మర­ణిం­చిన వా­రి­లో దా­దా­పు 20 మంది మహి­ళ­లు, 11 మంది చి­న్నా­రు­లు ఉన్నా­ర­ని.. మర­ణిం­చిన అం­ద­రూ తె­లం­గాణ రా­జ­ధా­ని హై­ద­రా­బా­ద్‌­కు చెం­ది­న­వా­రే­న­ని అధి­కా­రు­లు వె­ల్ల­డించా­రు. డీ­జి­ల్ ట్యాం­క­ర్‌­ను ఢీ­కొ­న­గా­నే మం­ట­లు చె­ల­రే­గి బస్సు మొ­త్తం వ్యా­పిం­చా­యి. ప్ర­మాద సమ­యం­లో యా­త్రి­కు­లం­తా ని­ద్ర­లో ఉం­డ­టం­తో మృ­తుల సం­ఖ్య ఎక్కు­వ­గా ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ట్యాం­క­ర్‌­ను బస్సు ఢీ­కొ­న­గా­నే.. పె­ద్ద ఎత్తున మం­ట­లు చె­ల­రే­గి, బస్సు పూ­ర్తి­గా దగ్ధ­మై­పో­యిం­ది.

మృతుల వివరాలు..

మృ­తు­ల్లో రహీ­ము­న్నీ­సా, రహ­మ­త్‌ బీ, షె­హ­నా­జ్‌ బేగం, గౌ­సి­యా బేగం, కదీ­ర్‌ మహ్మ­ద్, మహ్మ­ద్‌ మౌ­లా­నా, షో­య­బ్‌ మహ్మ­ద్, సో­హై­ల్‌ మహ్మ­ద్, మస్తా­న్‌ మహ్మ­ద్, పర్వీ­న్‌ బేగం, జకి­యా బేగం, షౌ­క­త్ బేగం, ఫర్హీ­న్‌ బేగం, జహీ­న్‌ బేగం, మహ్మ­ద్‌ మం­జూ­ర్‌, మహ్మ­ద్‌ అలీ­తో పాటు మరో ఇద్ద­రు ఉన్నారు. మె­హ­దీ­ప­ట్నం ఫ్లై­జో­న్‌ ఏజె­న్సీ ద్వా­రా ని­ర్వా­హ­కు­లు టి­కె­ట్లు బు­క్‌ చే­శా­రు. ఈనెల 9న హై­ద­రా­బా­ద్‌ నుం­చి వీ­రం­తా ఉమ్రా­కు బయ­ల్దే­రా­రు. వి­జ­య­వం­తం­గా మక్కా యా­త్ర పూ­ర్తి­చే­సు­కు­ని మదీ­నా­కు వె­ళ్తు­న్న సమ­యం­లో రో­డ్డు ప్ర­మా­దం జరి­గిం­ది. మదీ­నా­కు 25 కి.మీ దూ­రం­లో బస్సు-డీ­జి­ల్‌ ట్యాం­క­ర్‌ ఢీ­కొ­న్నా­యి.

సచివాలయంలో కంట్రోల్ రూం

సౌదీ అరే­బి­యా­లో జరి­గిన ఘోర ప్ర­మా­దం­లో 45 మంది హై­ద­రా­బా­దీ­లు మర­ణిం­చ­డం­పై తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. ప్ర­మా­దం­లో హై­ద­రా­బా­ద్ కు చెం­దిన వారు ఎక్కు­వ­గా ఉన్న­ట్లు సమా­చా­రం రా­వ­డం­తో.. దీ­ని­పై పూ­ర్తి వి­వ­రా­లు తె­లు­సు­కో­వా­ల­ని సీ­ఎ­స్, డీ­జీ­పీ­కి కీలక ఆదే­శా­లు జారీ చే­శా­రు. బా­ధిత కు­టుం­బా­ల­కు సహా­యం అం­దిం­చేం­దు­కు వెం­ట­నే చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. సీఎం ఆదే­శా­ల­తో సీ­ఎ­స్ రా­మ­కృ­ష్ణ ఢి­ల్లీ­లో­ని రె­సి­డెం­ట్ కమి­ష­న­ర్, వి­దే­శాం­గ­శాఖ అధి­కా­రు­ల­తో మా­ట్లా­డా­రు. సౌదీ బస్సు ప్ర­మా­దం­లో మర­ణిం­చి­న­వా­రి కు­టుం­బాల కోసం సచి­వా­ల­యం­లో స్పె­ష­ల్ కం­ట్రో­ల్ రూమ్ ఏర్పా­టు చే­శా­రు. మక్కా­కు వె­ళ్లి­న­వా­రి కు­టుంబ సభ్యు­లు వి­వ­రాల కోసం79979 59754, 99129 19545 నం­బ­ర్ల­ను సం­ప్ర­దిం­చ­వ­చ్చ­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు.

Tags

Next Story