కరోనా భయంతో బ్యాంక్ ఆఫీసర్ బలవన్మరణం

SBI probationary officer sucide: అమ్మానాన్నకి కరోనా వచ్చింది. తనకి కూడా వస్తుందేమో అన్న భయం ఆమెని వెంటాడింది.. ఆ భయంతోనే బలవన్మరణానికి పాల్పడింది. బాగా చదువుకుని బ్యాంకులో ఫ్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్న వాణి అనవసర భయంతో అర్థాంతరంగా తనువు చాలించింది.
హైదరాబాద్‌కు చెందిన రుబ్బ వాణి అనే యువతి కరీంనగర్ మంకమ్మతోట బ్రాంచిలో ఉద్యోగం చేస్తోంది. స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో అద్దెకు ఉంటోంది. వాణి తండ్ర గత నెలలో కరోనా సోకి మృతి చెందాడు. తల్లికి కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో వాణికి తనకి కూడా కరోనా వస్తుందేమో అన్న ఆలోచనలు ఎక్కువయ్యాయి.
తనకి కూడా కరోనా సోకుతుందేమో అన్న భయం పట్టుకుంది. మానసిక వేదనతో కరీంనగర్‌లోని తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా భయం, తండ్రి మరణం తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com