SC: నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే "లోకల్"

SC: నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్
X
స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మినహాయింపు... జీవో 33ను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం... 9,10,11,12 తరగతులు చదివితేనే ఇక లోకల్

తె­లం­గా­ణ­లో వై­ద్య వి­ద్య చద­వా­ల­ను­కు­నే వి­ద్యా­ర్థుల స్థా­ని­కత అం­శం­పై కొ­న్నే­ళ్లు­గా వి­వా­దా­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. తా­జా­గా స్థా­ని­కత అం­శం­పై సు­ప్రీం కో­ర్టు సం­చ­లన తీ­ర్పు­ను వె­లు­వ­రిం­చిం­ది. తె­లం­గా­ణ­లో వై­ద్య వి­ద్య చది­వా­ల­ను­కు­నే వి­ద్యా­ర్థు­ల­కు నా­లు­గే­ళ్ళ స్థా­ని­కత తప్ప­ని­స­రి అని స్ప­ష్టం చే­సిం­ది. ఇదే అం­శం­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం వి­డు­దల చే­సిన జీ­వో­ను సమ­ర్థిం­చిం­ది. తె­లం­గా­ణ­లో వరు­స­గా 9 ,10, 11,12 తర­గ­తు­లు చది­వి­తే­నే లో­క­ల్ అంటూ స్ప­ష్టం చే­సిం­ది. ఈ రూ­ల్స్ లో ప్ర­భు­త్వ ఉద్యో­గుల పి­ల్ల­ల­కు మా­త్రం మి­న­హా­యిం­పు ఉం­టుం­ద­ని సు­ప్రీం­కో­ర్టు స్ప­ష్టం చే­సిం­ది. లో­క­ల్ రి­జ­ర్వే­ష­న్‌ అం­శం­పై తె­లం­గా­ణ­కు ఊరట కలి­గిం­చే­లా సు­ప్రీం­కో­ర్టు కీలక తీ­ర్పు­ని­చ్చిం­ది. ప్ర­భు­త్వ ఉద్యో­గుల పి­ల్ల­ల­కు మా­త్రం మి­న­హా­యిం­పు ఇచ్చిం­ది. స్థా­ని­కత అం­శం­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం జారీ చే­సిన జీఓ నెం­బ­ర్ 33కి అత్యు­న్నత న్యా­య­స్థా­నం పూ­ర్తి స్థా­యి మద్ద­తు తె­లి­పిం­ది. గతం­లో రా­ష్ట్ర హై­కో­ర్టు సిం­గి­ల్ జడ్జి, డి­వి­జ­న్ బెం­చ్ ఇచ్చిన ఉత్త­ర్వు­లు పక్కన పె­డు­తూ ప్ర­ధాన న్యా­య­మూ­ర్తి జస్టి­స్ బీ­ఆ­ర్ గవా­య్ నే­తృ­త్వం­లో­ని ధర్మా­స­నం ఈ తీ­ర్పు­ను వె­లు­వ­రిం­చిం­ది. 9వ తర­గ­తి నుం­చి 12వ తర­గ­తి వరకు తె­లం­గా­ణ­లో చద­వా­ల్సిం­దే అన్న ని­బం­ధ­న­ను సు­ప్రీం­కో­ర్టు సమ­ర్థిం­చిం­ది. ఈ తీ­ర్పు ప్ర­కా­రం.. రా­ష్ట్రం­లో­ని మె­డి­క­ల్ కో­ర్సు­ల్లో సీ­ట్లు పొం­దా­లం­టే వి­ద్యా­ర్థి తప్ప­ని­స­రి­గా స్థా­ని­కత ని­బం­ధ­న­ల­ను పా­టిం­చా­లి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రిజర్వేషన్ విధానం అమల్లో ఉంది. ఇది స్థానిక , స్థానికేతర విద్యార్థుల మధ్య సమాన అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది.

ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు

రా­ష్ట్ర వి­భ­జన తర్వాత తమ పి­ల్ల­లు మరో రా­ష్ట్రం­లో చద­వా­ల్సి వచ్చిం­ద­ని అభ్య­ర్థుల తర­పున పి­టి­ష­న­ర్లు వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. ఇప్ప­టి­కే రా­ష్ట్రం­లో లో­క­ల్ కోటా పై జీవో 33 ను అమలు చే­స్తు­న్నా­మ­ని తె­లం­గాణ ప్ర­భు­త్వం సు­ప్రీం కో­ర్టు­కు వి­న్న­విం­చిం­ది. అయి­తే ప్ర­భు­త్వ ఉద్యో­గు­లు తప్ప­ని పరి­స్థి­తు­ల్లో ఇతర రా­ష్ట్రా­ల్లో పని చే­స్తు­న్నా­ర­ని..దాం­తో వా­ళ్ళ పి­ల్ల­ల­కు జీవో 33 నుం­చి మి­న­హా­యిం­పు ఇస్తా­మ­ని ప్ర­భు­త్వం కో­ర్టు­కు చె­ప్పిం­ది. రా­ష్ట్ర­ప్ర­భు­త్వం చె­ప్పిన అం­శా­ల­ను పరి­గ­ణ­లో­కి తీ­సు­కు­న్న సు­ప్రీం కో­ర్ట్ చీఫ్ జస్టి­స్ బి ఆర్ గవా­య్ ధర్మా­స­నం తీ­ర్పు వె­ల్ల­డిం­చిం­ది. కేవలం ఆల్ ఇండియా కోటా కింద లభించే 15 శాతం సీట్లకే అర్హులు అవుతారు. మిగిలిన 85 శాతం సీట్లు పూర్తిగా స్థానిక విద్యార్థులకే కేటాయించబడతాయి. సుప్రీంకోర్టు తీర్పుతో పెద్ద వివాదానికి తెర పడింది.

Tags

Next Story