SC: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

SC: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
X
తెలంగాణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట.... తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో విచారణ... పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై సు­ప్రీం కో­ర్టు­లో తె­లం­గాణ ప్ర­భు­త్వా­ని­కి ఊరట లభిం­చిం­ది. రి­జ­ర్వే­ష­న్ల­కు వ్య­తి­రే­కం­గా దా­ఖ­లైన పి­టి­ష­న్ల­ను సర్వో­న్నత న్యా­య­స్థా­నం కొ­ట్టి­వే­సిం­ది. హై­కో­ర్టు­లో పెం­డిం­గ్‌­లో ఉం­డ­టం­తో వి­చా­ర­ణ­కు స్వీ­క­రిం­చ­లే­మ­ని జస్టి­స్‌ వి­క్ర­మ్‌­నా­థ్‌, జస్టి­స్‌ సం­దీ­ప్‌ మె­హ­తా­ల­తో కూ­డిన ధర్మా­స­నం పి­టి­ష­న్‌­ను తి­ర­స్క­రిం­చిం­ది. తె­లం­గాణ స్థా­నిక ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు రి­జ­ర్వే­ష­న్ల పెం­పు­పై వంగా గో­పా­ల్‌­రె­డ్డి అనే వ్య­క్తి సు­ప్రీం­కో­ర్టు­లో పి­టి­ష­న్‌ వే­శా­రు. దీ­ని­పై వి­చా­రణ జరి­పిన ద్వి­స­భ్య ధర్మా­స­నం.. హై­కో­ర్టు­లో వి­చా­ర­ణ­లో ఉం­డ­గా ఇక్క­డ­కు ఎం­దు­కు వచ్చా­ర­ని పి­టి­ష­న­ర్‌ తరఫు లా­య­ర్‌­ను ప్ర­శ్నిం­చిం­ది. దీం­తో తె­లం­గాణ హై­కో­ర్టు స్టే ఇవ్వ­డా­ని­కి ని­రా­క­రిం­చిం­ద­ని ఆయన బదు­లి­చ్చా­రు. దీం­తో అక్కడ స్టే ఇవ్వ­డా­ని­కి ని­రా­క­రి­స్తే ఇక్క­డ­కు వస్తా­రా అని ప్ర­శ్నిం­చిం­ది. ఈ నే­ప­థ్యం­లో హై­కో­ర్టు­లో పెం­డిం­గ్‌ ఉన్నం­దున వి­చా­ర­ణ­కు స్వీ­క­రిం­చ­లే­మ­ని పి­టి­ష­న్‌­ను కొ­ట్టి­వే­సిం­ది. సు­ప్రీం­కో­ర్టు పి­టి­ష­న్‌­ను డి­స్మి­స్ చే­య­డం­తో, పి­టి­ష­న­ర్ తరపు న్యా­య­వా­ది తమ పి­టి­ష­న్‌­ను వె­న­క్కి తీ­సు­కుం­టు­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు. దీం­తో తె­లం­గాణ హై­కో­ర్టు­లో జరి­గే వి­చా­ర­ణ­పై ఉత్కంఠ నె­ల­కొం­ది. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై తె­లం­గాణ ప్ర­భు­త్వం భా­రీ­గా ఆశ­లు­పె­ట్టు­కుం­ది. హై­కో­ర్టు­లో ఇప్ప­టి­కే పి­టి­ష­న్ వి­చా­ర­ణ­లో ఉన్నం­దున, అత్య­వ­స­రం­గా జో­క్యం చే­సు­కు­ని జీవో అమ­లు­పై స్టే ఇవ్వా­ల­న్న పి­టి­ష­న­ర్ వి­జ్ఞ­ప్తి­ని సు­ప్రీం­కో­ర్టు తో­సి­పు­చ్చిం­ది. తె­లం­గాణ హై­కో­ర్టు వి­చా­ర­ణ­తో తె­లం­గా­ణ­లో స్థా­నిక ఎన్ని­క­లు జరు­గు­తా­యా వా­యి­దా పడ­తా­యా అన్న­ది తే­లా­ల్సి ఉంది.

పిటిషన్‌లో ఏముందంటే...?

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో మొ­త్తం రి­జ­ర్వే­ష­న్లు 50 శాతం దా­టు­తు­న్నా­య­ని గో­పా­ల్‌ రె­డ్డి తన పి­టి­ష­న్‌­లో తె­లి­పా­రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ది­వ్యాం­గు­లు, ఇతర రి­జ­ర్వే­ష­న్లు అన్నీ కలి­పి కూడా 50 శాతం రి­జ­ర్వే­ష­న్‌ దా­ట­వ­ద్ద­ని గతం­లో సు­ప్రీం­కో­ర్టు తీ­ర్పు ఇచ్చిం­ద­ని ప్ర­స్తా­విం­చా­రు. సు­ప్రీం­కో­ర్టు ఇచ్చిన సీ­లిం­గ్‌­ను ఎత్తి­వే­స్తూ బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్‌ కల్పిం­చ­డం చట్ట­వి­రు­ద్ధ­మ­ని పే­ర్కొ­న్నా­రు. ఎస్సీ­ల­కు15 శాతం రి­జ­ర్వే­ష­న్‌, ఎస్టీ­ల­కు 10 శాతం, బీ­సీ­ల­కు ఇచ్చే రి­జ­ర్వే­ష­న్‌ 42 శా­తం­తో కలు­పు­కుం­టే మొ­త్తం రి­జ­ర్వే­ష­న్లు 67 శాతం అవు­తు­న్న­ద­ని తె­లి­పా­రు. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్‌ కల్పిం­చే జీవో 9ను తక్ష­ణ­మే రద్దు­చే­యా­ల­ని కో­రా­రు. ఈ పి­టి­ష­న్‌­లో మా­ధ­వ­రె­డ్డి, తీ­న్మా­ర్‌ మల్ల­న్న ఇద్ద­రు కూడా ఇం­ప్లీ­డ్‌ అయ్యా­రు. దీ­ని­పై వి­చా­రణ జరి­పిన సు­ప్రీం­కో­ర్టు ద్వి­స­భ్య ధర్మా­స­నం పి­టి­ష­న్‌­ను కొ­ట్టి­వే­సిం­ది. రే­వం­త్‌­రె­డ్డి నే­తృ­త్వం­లో­ని కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం సె­ప్టెం­బ­ర్‌ 26న జీవో నం­బ­ర్‌ 9 జారీ చేసి, స్థా­నిక సం­స్థ­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్‌ ప్ర­క­టిం­చిం­ది. దీ­ని­ని సా­మా­జిక న్యా­యం­గా వర్ణిం­చిం­ది. ఈ జీవో ఆధా­రం­గా రి­జ­ర్వే­ష­న్ల గె­జి­ట్ల­ను పం­చా­య­తీ­రా­జ్‌­శాఖ వి­డు­దల చే­సిం­ది. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ పట్టుదలగా ఉంది.

Tags

Next Story