Local Body MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది. దీంతో మార్చి 28వ తేదీన నోటిఫికేషన్ విడదల కానుండగా.. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించారు. అలాగే, నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడానికి ఏప్రిల్ 9వ తేదీన చివరి అవకాశం. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది అని ఈసీ తెలిపింది. ఇక, ఏప్రిల్ 25వ తేదీన తుది ఫలితాల వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనింది.
అయితే, హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని అటు అధికార కాంగ్రెస్ చూస్తుండగా.. మరోసారి ఎమ్మెల్సీ పదవీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఇక, భాగ్యనగరంలో బోణీ కొట్టాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తుండగా.. పతంగి పార్టీ మాత్రం తన మార్క్ చూపించాలని యోచిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com