తెలంగాణ

తెలంగాణలోని విద్యాసంస్థలకు సంక్రాంతి పండగ సెలవులను పొడిగించే అవకాశం..!

Telangana : తెలంగాణలోని విద్యాసంస్థలకు సంక్రాంతి పండగ సెలవులను పొడగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణలోని విద్యాసంస్థలకు సంక్రాంతి పండగ సెలవులను పొడిగించే అవకాశం..!
X

Telangana : తెలంగాణలోని విద్యాసంస్థలకు సంక్రాంతి పండగ సెలవులను పొడిగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులను మరో మూడు రోజులు పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి పండగ సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా సెలవులు పొడగించే అంశంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది . దీంతో సెలవులను 20 వ తేదీ వరకు పొడగిస్తారని చెబుతున్నారు అధికారులు.

అటు విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలుచేస్తామంటున్నారు. ఒకవేళ సెలవులు ఎక్కువ రోజులు పొడగిస్తే ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుందన్న వాదన సైతం వినిపిస్తోంది. అటు ప్రతక్ష్య తరగతులు లేక ఆన్‌లైన్‌ పాఠాలు లేకుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక సెలవులు పొడగిస్తారా? లేదా అన్నది? త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావడానికి వీలుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES