ఎంకన్న దర్శనానికి వందేభారత్‌లో.. ఎప్పటినుంచంటే..

ఎంకన్న దర్శనానికి వందేభారత్‌లో.. ఎప్పటినుంచంటే..
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సింద్రాబాద్-విశాఖపట్నంల మొదలై ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంది.

Vande Bharat: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సింద్రాబాద్-విశాఖపట్నంల మొదలై ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంది.ఇక ఇప్పుడు తిరుపతికి కూడా ఈ ట్రైన్‌ను నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో వారంలో ఆరు రోజుల పాటు సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్‌ను నడపాలని నిర్ణయించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ రూట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఏయే రూట్లలో వందేభారత్..

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్-కర్నూలు, వికారాబాద్-తాండూరు-రాయచూరు.. ఈ విధంగా నాలుగు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్ ధర, ప్రయాణ సమయం వంటివి తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 8 నుంచి ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందేభారత్. ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ చూరగొంటుందని అధికారులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story