Secunderabad Mahankali Bonalu: మొక్కుబడిగా పూజలు.. స్వర్ణలత భవిష్యవాణి

Secunderabad Mahankali Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో రెండోరోజు రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత రంగంలో భవిష్యవాణి వినిపించారు. మహంకాళి అమ్మవారికి అభిముఖంగా నిలిబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. మహంకాళి అమ్మవారి జరుగుతున్న పూజలపై రంగంలో స్వర్ణలత ప్రశ్నించారు.
శాస్త్రోక్తంగా పూజలు జరగటం లేదన్న స్వర్ణలత... మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడిలో జరుగుతున్న పూజలు భక్తులను సంతోష పెట్టేందుకేనని స్వర్ణలత భవిష్యవాణిలో పేర్కొన్నారు. అటు అమ్మవారి రూపం మార్పుపై ప్రశ్నించిన స్వర్ణలత.. రూపాన్ని స్థిరంగా ఉంచాలని స్పష్టం చేశారు. రంగం కార్యక్రమానికి మంత్రి తలసానితోపాటు ఆలయ అర్చకలు, పండితులు, అధికారులు హాజరయ్యారు.
రంగం కార్యక్రమం పూర్తికావటంతో సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగనుంది. నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తి కానుంది...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com