Fake Call : శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ పోలీసులకు ఫేక్ కాల్

శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబ్ ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఫేక్ కాల్ అని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఫేక్ కాల్ చేసిన నిందితుడు మిరాజ్ ఖాన్‌ని అరెస్ట్ చేశారు. అసలు ఫేక్ కాల్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ నిందితుడిని ఆరా తీశారు. ఇక అతడు చెప్పిన సమాధానానికి పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. బోయిన్‌పల్లిలో లేబర్ పనిచేసే మిరాజ్‌ఖాన్ పెళ్లిసంబంధం చూడమంటూ ఓ మహిళకు 50వేల రూపాయలిచ్చాడు. ఐతే మధ్యవర్తిగా ఉన్న ఆ మహిళ సంబంధం చూడకపోగా.. డబ్బులు కూా ఇవ్వకుండా వాయిదాలు పెడుతూ వస్తోంది. దీంతో మహిళపై కక్ష పెంచుకున్న నిందితుడు ఎలాగైనా ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆమె వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబ్ ఉందంటూ 100కు డయల్ చేశాడు. మహిళ పట్టుకున్న బుట్టలో బాంబ్ ఉందంటూ పోలీసులకు ఆనవాళ్లు చెప్పాడు. వెంటనే స్టేషన్‌కు వెళ్లిన పోలీసులు... తనిఖీలు చేపట్టి అది ఫేక్ బాంబ్ కాల్ అని తేల్చేశారు. మిరాజ్‌ని అరెస్ట్ చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com