Telangana Paddy Procurement: ధాన్యం కొనుగోలుపై తెలంగాణకు కేంద్రం స్పష్టత..

Telangana Paddy Procurement: ధాన్యం కొనుగోలుపై తెలంగాణకు కేంద్రం స్పష్టత..
X
Telangana Paddy Procurement: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది.

Telangana Paddy Procurement: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని వెల్లడించింది. గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్లు తెలిపింది. కొనుగోళ్లు ఆపారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది కేంద్రం.

ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం కలిసింది. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిశారని, తాము మంగళవారం కలిసినప్పుడు కూడా అన్ని వివరాలు వెల్లడించామని మంత్రుల బృందం గుర్తు చేసింది.

Tags

Next Story