SEETHAKKA: తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది: మంత్రి సీతక్క

తనపై అవినీతి చేసిన వారిపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన సెల్‌ఫోన్లలో అవినీతి జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుందని హెచ్చరికలు చేశారు. మరోవైపు.. మేడారం పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను కూడా మంత్రి సీతక్క గట్టిగా తిప్పికొట్టారు. . అంగన్వాడీ టీచర్లకు కొన్న ఫోన్ల ధరలపై చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. ఒక్కో సెల్‌ఫోన్‌ను రూ.11,650కు కొనుగోలు చేస్తే.. రూ.14 వేలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క.. తాను ఎక్కడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. ఇటీవల మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరిగిందని.. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కూడా అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపైనా మంత్రి సీతక్క స్పందించారు. మేడారం పనుల్లో అవినీతికి తావులేదని పేర్కొంటూ.. ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే మేడారం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
