సీతక్క విజయం.. మంత్రి అయిన వెంటనే ఊరికి న్యాయం

సీతక్క విజయం.. మంత్రి అయిన వెంటనే ఊరికి న్యాయం
మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టడానికి సిద్ధమవుతోంది.

మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టడానికి సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయింది. అధికారంలోకి వచ్చిన వాళ్లంతా అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలుకుతారు. తమకు ఓట్లేసి అధికారం కట్టబెట్టిన వాళ్ల కనీస అవరాలను గుర్తించి న్యాయం చేయాలన్న ఆలోచన ఇసుమంతైనా ఉండదు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్క స్వగ్రామమైన ముులుగు జిల్లాలో ఈ రోజు వరకు బస్సు సౌకర్యం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి సీతక్క ఊరికి రోడ్డు మార్గం ఉన్నా బస్సు లేకపోవడంతో ఊరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మీడియాలో వార్తలు రావడంతో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ స్పందించింది. ఈ మేరకు అధికారులు రూట్ సర్వే నిర్వహించారు. త్వరలో ఆ రూట్ లో బస్సు నడిపిస్తామని వరంగల్ 2 డిపో మేనేజర్ సురేశ్ తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story