నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. దేవరాజ్ రెడ్డి..

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులెవరో క్లియర్‌గా పోలీసులు తేల్చిన తర్వాత కూడా ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పోలీసులే రిమాండ్ రిపోర్ట్ రూపంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్ లో A1గా దేవరాజ్ రెడ్డి, A2 గా సాయికృష్ణారెడ్డి, A3 గా అశోక్ రెడ్డిని చేర్చారు. రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్‌లో దేవరాజ్‌ను A3 పోలీసులు చెప్పారు. ఇప్పుడు దేవరాజ్ రెడ్డిని రిమాండ్ రిపోర్ట్‌లో A1 చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులులో మొత్తం 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు.
దేవరాజ్‌ను పెళ్లి చేసుకుంటానని.. కుటుంబ సభ్యుల ముందే శ్రావణి ప్రపోజ్ చేసినట్టు విచారణలో తేలింది. కానీ దేవరాజ్ ఒప్పుకోలేదు. అయితే దేవరాజ్‌ను ఒప్పించేందుకు శ్రావణి తీవ్రంగా ప్రయత్నించింది. సాయికృష్ణ, అశోక్ రెడ్డిలతో శ్రావణి రిలేషన్ ఉండటంతో దేవరాజ్ ఒప్పుకోలేదు. కానీ దేవరాజ్‌ను కలవడానికి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో శ్రావణి ప్రయత్నించిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రావణిని.. సాయికృష్ణ, అశోక్‌రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు బెదిరించారు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని దేవరాజ్ తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్‌కు వెళ్లారు.
అటు సాయికృష్ణారెడ్డి రాత్రి తొమ్మిదిన్నరకు శ్రీకన్య హోటల్‌కు చేరుకున్నట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అక్కడి నుంచి శ్రావణిని కొట్టి ఆటోలో తీసుకెళ్లాడు సాయికృష్ణ. దేవరాజ్‌ను కలవకూడదని.. సాయి, అశోక్‌రెడ్డిలు శ్రావణిని బెదిరించారు. దేవరాజ్‌ను చంపి ఆర్థికంగా ఆదుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపులతో భయపడ్డ శ్రావణి... హైదరాబాద్ వదిలి వెళ్లిపోదామని దేవరాజ్‌ను కోరింది. కానీ.. ఆ ఇద్దరితో శ్రావణికి ఉన్న రిలేషన్ కారణంగా దేవరాజ్ ఒప్పుకోలేదు. చివరికి.. దేవరాజ్, సాయికృష్ణ, అశోక్ రెడ్డిల వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. కేసు విచారణ తర్వాత.. దేవరాజ్, సాయికృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇప్పుడు.. పరారీలో ఉన్న A3 అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com