Illegal Assets Case: శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు

Illegal Assets Case: శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
బడా రియల్‌ కంపెనీలతో బంధం, బాలకృష్ణ తమ్ముడు అరెస్టు

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు అతడిని విచారించిన అధికారులు.. బాలకృష్ణకు బినామీగా ఉండి నవీన్‌ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.

ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివ బాలకృష్ణ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. శివ బాలకృష్ణ అక్రమాస్తులు పెద్ద ఎత్తున బటయపడుతున్నాయి. ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని శివ బాలకృష్ణను విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణ ఆస్తులు, బినామీ ఆస్తులపై ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు.

శివ బాలకృష్ణ బినామీల పేరుపై 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్‌ను ఏసీబీ గుర్తించింది. సోదరుడు నవీన్ పేరుతో భారీగా భినామీ ఆస్తులు ఉన్నట్లు కనుగొంది. భరత్ కుమార్ అనే మరో బినామీ పేరుపై భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూడు రెవిన్యూ డివిజన్స్‌లో హైరేస్ బిల్డింగ్‌లు, వందల కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శివ బాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెండింగ్‌లో ఉన్న వందకు పైగా ఫైల్స్‌ను క్లియర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో సోమ, మంగళవారం రెండు రోజులు వరుసగా సోదాలు నిర్వహించిన ఏసీబీ.. బుధవారం పలువురు బినామీలను, అనుమానితులను విచారించనుంది. మరోవైపు బుధవారంతో శివబాలకృష్ణ కస్టడి ముగియనుంది. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పర్చనున్నారు. మరో ఐదు రోజులపాటు అతణ్ని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story