దుమ్ములేపే న్యూస్.. మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు

మహిళల ఓట్లే ఆధారంగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారి కోసం మరో ఆకర్షక పథకం ప్రకటించింది. ఇప్పటికే లేడీస్ కు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. లేడీస్ పేరుమీదే గృహజ్యోతి అమలుచేస్తోంది. ఇప్పుడు నెలకు రూ.2500 పథకం అమలుకు టైం పడుతుండటంతో.. కొత్త స్కీమ్ తో వచ్చింది. మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వడ్డీ లేని రుణాలపై ప్రకటన చేశారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రాబోయే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
మరోవైపు.. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క.. రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2లో 2 వేల 400 మెగావాట్ల ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగినంత విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యం అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2031-32 అంచనాల ప్రకారం ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించాలని అధికారులకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com