హైదరాబాద్‌లోని పలు సెంటర్లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొరత..!

ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతిదీ గండంగానే మారింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరేవాళ్లకు బెడ్లు దొరకడం లేదు. కొన్నిచోట్ల ఆక్సిజన్ కొరత ఉంది. ఇంన్ని చోట్ల రెమ్‌డెసివిర్ లాంటి మందులకూ విపరీతమైన వెయిటింగ్. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కరోనా టెస్ట్ కిట్‌లకు కూడా షార్టేజ్ వచ్చింది. యాంటిజెన్స్ కిట్స్ లేక కొన్ని సెంటర్లలో పరీక్షలు ఆపేశారు. మరికొన్ని చోట్ల రేపటి తర్వాత పరిస్థితి అంటనేది చూడాలి. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు చేసే విషయంలో కూడా వైద్య సిబ్బంది కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్న కేంద్రాల వద్ద.. క్యూలు భారీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణం ర్యాపిడ్ కిట్లు తెప్పించే ఏర్పాట్లు చేసింది. రాత్రికల్లా ఆ కిట్లు హైదరాబాద్ చేరుకుంటాయని చెప్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com