నా బర్త్‌డే వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దు : కేటీఆర్

X
తన జన్మదిన వేడుకలకోసం ఎవరు హైదరాబాద్ రావద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా... సీఎం ఆదేశాల మేరకు నేతలు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో....అవసరమైన చోట సహాయకచర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ.... మొక్కలు నాటాలని కేటీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలో భాగంగా మంత్రి బర్త్‌డే సందర్బంగా దివ్యాంగులకు ఇవ్వనున్న ద్విచక్ర వాహనాల పంపిణీని వర్షాలు తగ్గుముఖం పట్టాక చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
