సిద్దిపేట్ రైతులు రోడ్డెక్కారు

సిద్దిపేట్ రైతులు రోడ్డెక్కారు
ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌ చెప్పినా ధాన్యం కొనడం లేదని వాపోయారు. అకాల వర్షాలకు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లు లేవంటూ హబ్సీపూర్‌ ప్రధాన రహదారిపై ఆకారం రైతులు ఆందోళనకు దిగారు. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌ చెప్పినా ధాన్యం కొనడం లేదని వాపోయారు. అకాల వర్షాలకు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే లారీలు లేవని చెప్పారు. వడ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. స్పాట్‌కు వెళ్లిన అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పారు. లారీలు పంపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Tags

Read MoreRead Less
Next Story