Siddipet: సిద్ధిపేటలో క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే దంపతుల డ్యాన్స్..

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పోలీస్ శాఖ, రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌ను ఎమ్మెల్యే సతీష్ కుమార్, సీపీ శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో 21 కిలోమీటర్లతో పాటు.. 10కే, 5కే పరుగు పందాలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆయన సతీమణి షమిత హాఫ్ మారథాన్‌లో పాల్గొని క్రీడాకారులతో కలిసి నృత్యాలు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.
21 కిలోమీటర్ల మారథాన్‌లో మొదటి బహుమతి సాధించిన రమేష్ చంద్ర అనే క్రీడాకారుడికి ఎమ్మెల్యే సతీష్ కుమార్, సీపీ శ్వేత బహుమతి ప్రధానం చేశారు. ఇక మూడు విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు. పోటీలు నిర్వహించినప్పుడే కాకుండా.. ప్రతి రోజు రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండవ తేదీన.. 30 సంవత్సరాలు దాటిన మహిళలకు 5కే రన్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.. ఈ పోటీల్లో గెలిచిన మహిళలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 60వేల రూపాయాలు, మూడవ బహుమతిగా 25వేల రూపాయలు అందిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com