Hyderabad: వెండి నాణేల కోసం భక్తులు బారులు

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. దీంతో వెండి నాణేల కోసం భక్తులు భారీగా పోటెత్తారు. ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలను దీపావళి రోజు భక్తులను అందించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు అంగనంగ వైభవంగా జరిగాయి. ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక్కడ దీపావళి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలు పంపిణీ చేశారు.
ఆనవాయితీ...
ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలను దీపావళి రోజు భక్తులను అందించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఈ దీపావలి రోజున కూడా భక్తులకు వెండి నాణెలు పంపిణీ చేసినట్లు ఆలయ ట్రస్టీ శంభు వివరించారు. ఇక ఆలయంతో ఇస్తున్న వెండి నాణేల కోసం భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిటకిటలాడింది.
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
దీపావళి వేళ లోగిళ్లన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వ్యాపారులు లక్ష్మీదేవికి వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అర్చకులు ధనలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహాశక్తి ఆలయంలోని ముగ్గురు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com