Sree Rama Chnadra: ఏంటి సార్ ఇది.. : సీఎంకు సింగర్ పోస్ట్

Sree Rama Chnadra: ఏంటి సార్ ఇది.. : సీఎంకు సింగర్ పోస్ట్
X
Sree Rama Chnadra: రాజకీయ నాయకులు అటుగుండా వెళుతున్నారంటే ఆ రోడ్ బ్లాక్.. ఎక్కడో మీటింగ్ అంటే ఇక్కడంతా జామ్..

Singer Sri Rama Chandra: రాజకీయ నాయకులు అటుగుండా వెళుతున్నారంటే ఆ రోడ్ బ్లాక్.. ఎక్కడో మీటింగ్ అంటే ఇక్కడంతా జామ్..ఓ పక్క టైమ్ అయిపోతుంటుంది.. మరో పక్క బండి కదలదు..

బ్రహ్మ దేవుడికి కూడా అర్ధం కానంత గజిబిజి రోడ్లు.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నామంటే అంతే సంగతులు.. సమయానికి చేరుకుంటామన్న ఆశ ఆవిరి అయిపోతుంది.. తాజాగా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర. దాంతో ఏకంగా సీఎం కేసీఆర్‌కు ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో సారాంశం.. ఓ పొలిటికల్ లీడర్ కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో నా ప్రయాణం అరగంట ఆలస్యమైంది.

నేను ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యింది. నేను ఒక్కడినే కాదు సార్ నాతో పాటు మరో 15 మంది కూడా ఫ్లైట్ మిస్సయ్యారు. గోవాలో ఓ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు మరో ఫ్లైట్ పట్టుకుని గోవా చేరుకోవడం కష్టం.

ఈ నేపథ్యంలో నేను సీఎం గారికి చేసుకునే విన్నపం ఏమంటే.. రాజకీయ నాయకుల కోసం మాలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఈ ట్వీట్‌ని సీఎంతో పాటు, కేటీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ట్యాగ్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి శ్రీరామ చంద్రకు భారీ మద్ధతు లభిస్తోంది.

Tags

Next Story