SIT: కాసేపట్లో సిట్ విచారణకు హరీష్ రావు

SIT: కాసేపట్లో సిట్ విచారణకు హరీష్ రావు
X
కేటీఆర్‌తో సమావేశం కానున్న హరీష్ రావు

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో పెను సం­చ­ల­నం సృ­ష్టిం­చిన ఫోన్ ట్యా­పిం­గ్ కేసు ఇప్పు­డు అత్యంత కీలక దశకు చే­రు­కుం­ది. ఈ కే­సు­ను దర్యా­ప్తు చే­స్తు­న్న ప్ర­త్యేక బృం­దం , మొ­ద­టి­సా­రి­గా బీ­ఆ­ర్ఎ­స్ అగ్ర­నేత, మాజీ మం­త్రి హరీ­ష్ రా­వు­కు నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. కాగా, కాసేపట్లో తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్ర­భు­త్వ హయాం­లో జరి­గిన ఈ అక్రమ ట్యా­పిం­గ్ వ్య­వ­హా­రం­లో హరీ­ష్ రావు పా­త్ర­పై సిట్ అధి­కా­రు­లు ఆయ­న­ను సు­దీ­ర్ఘం­గా ప్ర­శ్నిం­చే అవ­కా­శం ఉంది. ఈ కే­సు­లో అరె­స్ట­యిన నిం­ది­తు­లు , ఒక ప్ర­ముఖ టీవీ ఛా­న­ల్ యజ­మా­ని ఇచ్చిన వాం­గ్మూ­లం ఆధా­రం­గా­నే ఈ నో­టీ­సు­లు జారీ అయి­న­ట్లు తె­లు­స్తోం­ది. సదరు ఛా­న­ల్ ఎం­డీ­తో కలి­సి హరీ­ష్ రావు కొం­ద­రి ఫో­న్ల­ను ట్యా­ప్ చే­యిం­చా­ర­నే ఆరో­ప­ణ­ల­పై సిట్ ఆరా తీ­స్తోం­ది. ము­ఖ్యం­గా 2023 అసెం­బ్లీ ఎన్ని­కల సమ­యం­లో రా­జ­కీయ ప్ర­త్య­ర్థుల కద­లి­క­ల­ను గమ­నిం­చేం­దు­కు ఎస్ఐ­బీ అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు ఇచ్చా­ర­నే కో­ణం­లో దర్యా­ప్తు సా­గు­తోం­ది.

కేటీఆర్ తీవ్ర విమర్శలు

ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­లో బీ­ఆ­ర్ఎ­స్ ము­ఖ్య­నేత హరీ­ష్ రా­వు­కు సిట్ నో­టీ­సు­లు జారీ చే­య­డం­పై ఆ పా­ర్టీ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీఆర్ స్పం­దిం­చా­రు. ‘బొ­గ్గు­గ­నుల కుం­భ­కో­ణం నుం­చి ప్ర­జల దృ­ష్టి­ని మళ్లిం­చేం­దు­కే తె­ర­పై­కి ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­ను తీ­సు­కొ­చ్చా­రు. మాకు చట్టం­పై సం­పూ­ర్ణ నమ్మ­కం, వి­శ్వా­సం ఉన్నా­యి. ఏ వి­చా­ర­ణ­కు హా­జ­రు కా­వ­డా­ని­కై­నా సి­ద్ధం. వి­చా­ర­ణల పే­రు­తో ప్ర­తి­ప­క్షాల గొం­తు నొ­క్క­లే­రు. ప్ర­భు­త్వ చౌ­క­బా­రు బె­ది­రిం­పు­ల­కు ఎట్టి పరి­స్థి­తు­ల్లో భయ­ప­డం. రా­జ­కీయ వే­ధిం­పు­లే కాం­గ్రె­స్ పా­ర్టీ ఎజెం­డా­గా పె­ట్టు­కుం­ది. ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­ను అత్యు­న్నత న్యా­య­స్థా­న­మైన సు­ప్రీం­కో­ర్టే కొ­ట్టి­వే­సిం­ది. అయి­నా నో­టీ­సుల పే­రు­తో హడా­వి­డి చే­య­డం రే­వం­త్ రె­డ్డి ది­గ­జా­రు­డు­త­నా­ని­కి ని­ద­ర్శ­నం’ అని కే­టీ­ఆ­ర్ తీవ్ర విమర్శలు చేశారు.

Tags

Next Story