Suryapet Medical College: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు..

Suryapet Medical College: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట మెడికల్ కాలేజీ ర్యాగింగ్ వ్యవహారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు నిర్థారణ అయిన విద్యార్థులపై యాక్షన్ తీసుకున్నారు.
ఆరుగురు విద్యార్థులపై సంవత్సరం పాటు సస్పెన్షన్ విధిస్తూ డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు ఆ విద్యార్థులను హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. వెంటనే హాస్టల్ గదులు ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థులపై తీసుకున్న ఈ చర్యలపై తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు.
అంతకు ముందు సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ర్యాగింగ్ నుంచి తప్పించుకున్న ఓ విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
దీనిపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. బాయ్స్ హాస్టల్‌లో తనిఖీలు నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుడు చెప్పిన పేర్ల ప్రకారం విచారణ జరిపిన అధికారులు.. ర్యాగింగ్ జరినట్లు నిర్ధారించుకున్నారు. హుటాహుటిన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com