SLBC: టన్నెల్ ప్రమాదంలో ఒక మృతదేహం వెలికితీత

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం( SLBC) ప్రమాదంలో ఒక మృతదేహాన్ని...సిబ్బంది గుర్తించి వెలికి తీశారు. డి-2 పాయింట్‌లో మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు TBM ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. సొరంగంలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం 15 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. దాదాపు 15 రోజులు సహాయక చర్యలు చేపట్టగా.. ప్రమాదం అనంతరం ఆచూకి దొరకని 8 మందిలో పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికితీసింది. గురుప్రీత్ సింగ్ ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అమెరికా కు చెందిన రాబిన్ సన్ కంపెనీలో ఉద్యోగి అయిన గురుప్రీత్ టన్నెల్ లో టిబిఎమ్ ఆపరేటర్ గా చేస్తున్నాడు.
25 లక్షల నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో గురుప్రీత్ సింగ్ మృతి చెందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మృత దేహాన్ని పంజాబ్ లోని వారి స్వగ్రామానికి తెలంగాణ ప్రభుత్వం పంపించింది. గురుప్రీత్ మరణంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
SLBC వద్ద భయం.. భయం..!
SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ను కట్ చేస్తే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టారు. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.
కెడావర్ డాగ్స్ గుర్తించిన చోటే...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో కేరళకు చెందిన కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. ఆ కెడావర్ డాగ్స్ కొన్ని స్పాట్‌లను గుర్తించడంతో.. అక్కడ తవ్వకాలు జరిగిన అధికారులకు ఒక మృతదేహం దొరికింది. టీబీఎంలో కార్మికుడి చేయి ఇరుక్కున్నట్టు అధికారులు భావించారు. మరింత లోతుగా తవ్వగా రాత్రికి టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని గుర్తించి, టన్నెల్ నుంచి బయటకు తెచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com