SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేసి తీరుతాం

SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తి చేసి తీరుతాం
X
రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి.. 30 లక్షల ప్రజలకు తాగునీరు అందిస్తాం.. ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టం

నా­గ­ర్‌­క­ర్నూ­ల్ జి­ల్లా­లో­ని అచ్చం­పేట మం­డ­లం మన్నె­వా­రి పల్లి వద్ద ఉన్న ఎస్ఎ­ల్బీ­సీ టన్నె­ల్ ప్రా­జె­క్టు­ను మం­త్రు­లు ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి, కో­మ­టి­రె­డ్డి వెం­క­ట్ రె­డ్డి­తో కలి­సి సీఎం రే­వం­త్ ఆక­స్మి­కం­గా పరి­శీ­లిం­చా­రు. అనం­త­రం ఏరి­య­ల్ ఎల­క్ట్రో­మా­గ్నె­టి­క్ సర్వే కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చా­రు. నే­ష­న­ల్ జి­యో­ఫి­జి­క­ల్ రీ­సె­ర్చ్ ఇన్‌­స్టి­ట్యూ­ట్ (NGRI) మా­ర్గ­ద­ర్శ­క­త్వం­లో జరి­గే ఈ హె­లి­బో­ర్న్ మా­గ్నె­టి­క్ సర్వే, భూ­గ­ర్భం­లో 1000 మీ­ట­ర్ల లో­తుల వరకు షి­య­ర్ జో­న్లు, నీటి ప్ర­వా­హా­ల­ను గు­ర్తిం­చ­డా­ని­కి ఉప­యో­గ­ప­డు­తుం­ది. నల్గొండ, మహ­బూ­బ్ నగర్ జి­ల్లా­ల­లో మూడు లక్షల ఎక­రా­ల­కు సా­గు­నీ­రు, 30 లక్షల ప్ర­జా­నీ­కా­ని­కి తా­గు­నీ­రు అం­దిం­చే లక్ష్యం­తో చే­ప­ట్టిన ఎస్‌­ఎ­ల్‌­బీ­సీ పను­ల­ను రెం­డు సం­వ­త్స­రా­ల­లో పూ­ర్తి చే­స్తా­మ­ని రే­వం­త్ స్ప­ష్టం చే­శా­రు. ని­రం­త­రా­యం­గా సా­గు­తు­న్న ఎస్ఎ­ల్బీ­సీ సొ­రం­గం కూలి.. 8 మంది సజీవ సమా­ధి అయి­నా నే­ప­థ్యం­లో ని­లి­చి­పో­యిన పను­ల­ను చే­ప­ట్ట­డా­ని­కి ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి, రా­ష్ట్ర మం­త్రు­లు ఉత్తం­కు­మా­ర్ రె­డ్డి, వెం­క­ట్ రె­డ్డి, అచ్చం­పేట ఎమ్మె­ల్యే డా­క్ట­ర్ వం­శీ­కృ­ష్ణ, దే­వ­ర­కొండ ఎమ్మె­ల్యే వా­ళ్లు నా­య­క్ తది­త­రు­ల­తో కలి­సి టన్నె­ల్‌­ను పూ­ర్తి చే­సు­కో­వ­డా­ని­కి తీ­సు­కో­వా­ల్సిన చర్య­ల­ను గు­రిం­చి హెలి మా­గ్నె­టి­క్ సర్వే వి­వ­రా­ల­ను ని­పు­ణు­ల­తో కలి­సి పరి­శీ­లిం­చా­రు. ఎస్‌­ఎ­ల్‌­బీ­సీ టన్నె­ల్‌­ను పూ­ర్తి చే­సేం­దు­కు కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం ఎంతో కృషి చే­స్తోం­ద­ని రే­వం­త్‌ అన్నా­రు.

బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే...

‘‘ప్రా­జె­క్టు మం­జూ­రు చే­సి­న­ప్పు­డు టన్నె­ల్‌ పనుల అం­చ­నా వి­లువ రూ.1,968 కో­ట్లు. రెం­డు దశా­బ్దా­లు­గా సా­గు­తు­న్న టన్నె­ల్‌ పను­ల్లో ఎన్నో అవాం­త­రా­లు ఎదు­ర­య్యా­యి. తె­లం­గాణ ప్ర­భు­త్వం ఏర్ప­డే­నా­టి­కి 30 కి­లో­మీ­ట­ర్ల టన్నె­ల్‌ ని­ర్మా­ణం పూ­ర్త­యిం­ది. కే­సీ­ఆ­ర్‌ ప్ర­భు­త్వం పదే­ళ్ల­లో మి­గ­తా 10కి.మీ టన్నె­ల్‌ పూ­ర్తి చే­య­లే­దు. పె­ద్ద­గా కమీ­ష­న్లు రా­వ­ని ఈ ప్రా­జె­క్టు­ను పక్క­కు పె­ట్టా­రు. ఏపీ­లో జగ­న్‌ ప్ర­భు­త్వం పో­తి­రె­డ్డి­పా­డు­ను వి­స్త­రి­స్తుం­టే కే­సీ­ఆ­ర్‌ చూ­స్తూ ఊరు­కు­న్నా­రు. రూ.2 వేల కో­ట్లు ఖర్చు చేసి ఉంటే ఉమ్మ­డి నల్గొండ జి­ల్లా­ల­కు నీరు అం­దే­ది. ఈ ప్రా­జె­క్టు పూ­ర్త­యి­తే.. కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వా­ని­కి మం­చి­పే­రు వస్తుం­ద­నే దు­రు­ద్దే­శం­తో పట్టిం­చు­కో­లే­దు. కృ­ష్ణా నది మీద చే­ప­ట్టిన అన్ని ప్రా­జె­క్టు­ల­ను కే­సీ­ఆ­ర్‌ ని­ర్ల­క్ష్యం చే­శా­రు.’’ అని రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. ఈ ప్రా­జె­క్టు 1983లో మం­జూ­రైం­ద­ని, ఇప్ప­టి­కీ పూ­ర్తి­కా­క­పో­వ­డం బా­ధా­క­ర­మ­ని చె­ప్పా­రు. నా­గ­ర్‌­క­ర్నూ­ల్‌ జి­ల్లా మన్నే­వా­రి­ప­ల్లె­లో పర్య­టిం­చిన సీఎం.. హెలీ మా­గ్న­టి­క్‌ సర్వే­కు సి­ద్ధం­గా ఉన్న సర్వే హె­లి­కా­ప్ట­ర్‌, అధు­నా­తన పరి­క­రా­ల­ను పరి­శీ­లిం­చా­రు. టన్నె­ల్‌ బో­ర్‌ మి­ష­న్‌­తో పను­లు చే­య­డం కష్టం­గా మా­రిం­ద­ని అన్నా­రు.

Tags

Next Story